శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (13:11 IST)

టమోటా జ్యూస్‌కి చిటికెడు ఉప్పు లేదా పంచదార కలుపుకుని తాగితే?

టమోటాలను మిక్సీలో వేసుకుని జ్యూస్‌లా చేసుకుని.. అందులో కాస్త ఉప్పు లేదా పంచదార వేసుకుని రోజూ తీసుకుంటే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. పండిన టమోటాను రోజుకు ఒకటి తీస

టమోటాలను మిక్సీలో వేసుకుని జ్యూస్‌లా చేసుకుని.. అందులో కాస్త ఉప్పు లేదా పంచదార వేసుకుని రోజూ తీసుకుంటే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. పండిన టమోటాను రోజుకు ఒకటి తీసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. 
 
టమోటా ద్వారా అందంతో పాటు ఆరోగ్యం పొందవచ్చు. టమోటాలో విటమిన్ ఎ,బి,సి పుష్కలంగా వున్నాయి. ఆహారాన్ని తీసుకునేందుకు అర గంట ముందు టమోటాను తీసుకోవడం ద్వారా బరువును నియంత్రించుకోవచ్చు. 
 
టమోటా గుజ్జులో పాలను కలిపి.. ఈ గుజ్జును ముఖానికి రాసుకుంటే.. ముఖం కాంతివంతంగా మారుతుంది. అలాగే టమోటా గుజ్జులో తేనె కలిపి ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. 
 
టమోటాను సగానికి సగం కట్ చేసి.. ముఖంపై కొద్దిసేపు మృదువుగా రబ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత ఆగి కడిగేస్తే చర్మంపై నున్న జిడ్డు తొలగిపోతుంది. చర్మం మృదువుగా తయారవుతుంది. టమోటా గుజ్జుకు రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేసి పావు గంట తర్వాత కడిగేస్తే చర్మం తళతళ మెరిసిపోతుంది.