గురువారం, 4 జులై 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 23 జూన్ 2023 (20:57 IST)

మగవారు తెల్ల ఉల్లిపాయలను తింటే ఏమవుతుంది?

White onions
తెల్ల ఉల్లిపాయ. ఏ ఉల్లిపాయ అయినప్పటికీ ఆహారంలో ముఖ్యమైన పదార్ధం. కాకపోతే ఉల్లిపాయలలో అత్యంత అరుదైన, ఔషధ గుణాలు కలిగినవి తెల్ల ఉల్లిపాయలు. వాటిని తింటే కలిగే మేలు ఏమిటో తెలుసుకుందాము. తెల్ల ఉల్లిపాయలను మగవారు తింటుంటే అవసరమైన శక్తి లభిస్తుంది. తెల్ల ఉల్లిపాయ అరుదైన, ఔషధ విలువలు పుష్కలంగా వున్నటువంటిది.
 
తెల్ల ఉల్లిపాయలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. తెల్ల ఉల్లిపాయల్లో ఉండే ఫ్లేవనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలపై ప్రభావవంతంగా పనిచేస్తాయి. తెల్ల ఉల్లిపాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. తెల్ల ఉల్లిపాయలో ఉండే ప్రొటీన్లు శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తాయి. ఇందులోని ప్రీబయోటిక్స్ కడుపులో నులిపురుగులు ఏర్పడకుండా నిరోధిస్తుంది.