సోమవారం, 20 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 4 జూన్ 2022 (22:17 IST)

మట్టికుండలో మంచినీళ్లు తాగితే ఏమవుతుంది?

pot-drinking water
వేసవి కాలంలో చాలామంది ఫ్రిడ్జిలో పెట్టుకుని మంచినీరు తాగుతుంటారు. ఐతే దానికి బదులు మట్టికుండలో మంచినీరు పోసుకుని వాటిని తాగితే ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. మట్టి కుండలో నీటిని నిల్వ ఉంచడం వల్ల నీరు సహజంగా చల్లబడుతుంది.


మట్టి కుండ ఉపరితలంపై చిన్న చిన్న రంధ్రాలను కలిగి ఉంటుంది. ఈ రంధ్రాల ద్వారా నీరు త్వరగా ఆవిరైపోతుంది. బాష్పీభవన ప్రక్రియ కుండ లోపల ఉన్న నీటి వేడిని కోల్పోతుందని నిర్ధారిస్తుంది, ఇది నీటి ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.

 
మనం తినే వాటిలో ఎక్కువ భాగం శరీరంలో ఆమ్లంగా మారి విషాన్ని సృష్టిస్తుంది. బంకమట్టి ఆల్కలీన్ స్వభావం కలిగి ఉంటుంది, ఇది ఆమ్ల ఆహారాలతో సంకర్షణ చెందుతుంది. తగినంత పిహెచ్ సమతుల్యతను అందిస్తుంది. తద్వారా ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యను దూరం చేస్తుంది. మట్టి కుండలో నిల్వ చేసిన నీటిలో ఎలాంటి రసాయనాలు ఉండవు, కాబట్టి ప్రతిరోజూ మట్టి కుండ నీటిని తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. ఇది నీటిలో ఉండే మినరల్స్ కారణంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

 
మండే వేసవి నెలల్లో వడదెబ్బ అనేది సాధారణ సమస్య. మట్టి కుండ నీరు త్రాగడం వడదెబ్బను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ఎందుకంటే మట్టి కుండ నీటిలో సమృద్ధిగా ఉండే ఖనిజాలు, పోషకాలను చెక్కుచెదరకుండా ఉంచుతుంది. త్వరగా రీహైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. రిఫ్రిజిరేటర్ నుండి చల్లని నీరు త్రాగడం వల్ల గొంతులో దురద, నొప్పి వస్తుంది.

 
మట్టి కుండలు నీటిని చల్లబరచడానికి మాత్రమే కాకుండా సహజంగా శుద్ధి చేయడానికి కూడా ఉపయోగపడతాయి. కుండలో వుండే పోరస్ మైక్రో-టెక్చర్ నీటిలోని కలుషితాలను అడ్డుకుంటుని, మంచినీరు త్రాగడానికి సాపేక్షంగా సురక్షితంగా చేస్తుంది.