గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 28 మే 2022 (21:08 IST)

''మంజీరా మంచితీర్థం'' ట్యాగ్ బాగుందా? సజ్జనార్‌కి నచ్చాల... ఓ టైటిల్ పోస్ట్ చేయండి...

TSRTC
తెలంగాణ ఆర్టీసి ఎండీగా బాధ్యతలు చేపట్టిన దగ్గర్నంచి అనేక సంస్కరణలతో ఆర్టీసి బస్సులను పరుగులెత్తిస్తున్నారు సజ్జనార్. ఆయన వివిధ రకాల ఆలోచనలు చేస్తూ అటు ఆర్టీసి ఉద్యోగుల్లో మంచి ఉత్సాహాన్ని నింపుతున్నారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన, శుభకరమైన ప్రయాణాన్ని ఆర్టీసి ద్వారా కల్పించాలని ఆయన కృషి చేస్తున్నారు.

 
తాజాగా ఆయన మరో ఆలోచన చేసారు. అదే... తెలంగాణ ఆర్టీసి... వాటర్ బాటిళ్లను తయారు చేసి, విక్రయించాలన్నది. ఈ వాటర్ బాటిళ్లకు బెస్ట్ టైటిల్, డిజైన్ సూచించాలని సజ్జనార్ పిలుపునిచ్చారు. తమ సూచనలను వాట్సాప్ నంబర్ 94409 70000కి పంపాలని విన్నవించారు. మరింకేం... మీ ఐడియాలను పంపేయండి.