మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 మార్చి 2022 (11:59 IST)

టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. రామప్ప దర్శన్ పేరుతో స్పెషల్ బస్సులు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులను ఆకర్షించేందుకు ఇప్పటికే అనేక ఆఫర్లు ప్రకటిస్తున్న ఆర్టీసీ ఇపుడు రామప్ప దర్శన్ పేరుతో ప్రత్యేక బస్సులను నడుపనుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. 
 
ప్రభుత్వ సెలవుదినాలు, ప్రతి రెండో శనివారాల్లో ఆర్టీసీ బస్సులు ఈ ప్రత్యేక సర్వీసులను నడుపుతుందని ఆయన వెల్లడించారు. ఈ సర్వీసు ఉదయం 9 గంటలకు హనుమకొండ డిపో నుంచి బయలుదేరుతుందన్నారు. 
 
ఈ సదుపాయాలను ప్రయాణికులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పూర్తి వివరాల కోసం 99592 26048 అనే మొబైల్ నంబరుకు  ఫోన్ చేసి తెలుసుకోవచ్చని ఆయన ట్వీట్ చేశారు.