ఆదివారం, 24 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 15 మే 2023 (21:47 IST)

గోధుమ రోటీలను మితిమీరి తింటే?

ఇటీవలి కాలంలో చాలామంది గోధుమలతో చేసిన రోటీలను తినడం చేస్తున్నారు. ఐతే పరిమితికి లోబడి తింటే ఫర్వాలేదు కానీ మోతాదుకి మించి అదే పనిగా గోధు రోటీలను తింటే అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయంటున్నారు పోషకాహార నిపుణులు. అవేంటో తెలుసుకుందాము. గోధుమ రొట్టె అధికంగా తింటే అది శరీరంలో కార్బోహైడ్రేట్లను పెంచి శరీరంలో కొవ్వు ఏర్పడటానికి కారణమవుతుంది.

రోటీలు ఎక్కువ తింటే శరీరంలో వేడి ఉత్పత్తి పెరిగి అధిక చెమట పట్టడం, శరీరంలో నీటి కొరత ఏర్పడటం జరుగుతుంది. రోటీలు ఎక్కువగా తింటే వాటిలో వుండే అదనపు కార్బోహైడ్రేట్లు కొవ్వుగా మారుతుంది. ఫలితంగా గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం సమస్యలకు కారణమవుతుంది.
 
గోధుమ రోటీలను అధిక మోతాదులో తింటే జీర్ణ సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. అధికంగా గోధుమ రోటీలను తినేవారిలో ప్రోటీన్ లోపం ఏర్పడుతుంది. దీనితో ఊబకాయం సమస్య తలెత్తవచ్చు. గోధుమ రోటీలను తినేవారు వాటిని తక్కువ సంఖ్యలో తింటూ పండ్లు, కూరగాయలకు చోటివ్వాలి.