ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 1 అక్టోబరు 2019 (20:49 IST)

గోళ్లపై తెల్లతెల్లని మచ్చలుంటే ఏమవుతుంది?

హెల్త్ చెకప్‌లో డాక్టర్లు గోళ్లు కూడా పరీక్షిస్తారు. ఎందుకంటే అవి మన ఆరోగ్యాన్నే కాకుండా మనం ఏం తింటున్నాం? ఏం లోపించింది కూడా తెలుపుతాయి. గోళ్లు పలచగా వున్నా, లేదా గోళ్ల మీద తెల్లని మచ్చలు, గాట్లు గానీ వున్నా శరీరంలో జింక్‌ లోపం వున్నట్లు అర్థం. కనుక ఎక్కువ చిక్కుళ్లు, పప్పు దినుసులు, పుట్టగొడుగులు, యీస్ట్ తినాలి. 
 
గోళ్లు చంచా ఆకారంలో వుంటే శరీరంలో ఇనుము లేదా విటమిన్‌ ఏ లేదా రెండూ లోపించి వున్నాయన్న మాట. ఆకుకూరలు, మొలకలు, క్యారట్‌లు, పుచ్చకాయ, గుమ్మడికాయ మొదలైనవి తినాలి. గోళ్లు పెళుసుగా వుంటే బయోటిన్‌ లోపం వున్నట్లు లెక్క. అలాంటప్పుడు పుట్టగొడుగులు, పుచ్చకాయ, అరటి పళ్లు తినాలి. 
 
గోళ్లు విరిగిపోయేట్లు, నిలువు, అడ్డగాట్లు వుంటే విటమిన్‌ బి లోపం వున్నట్లు తెలుస్తుంది. క్యారట్‌లు, పాలకూర మొదలైవి తినాలి. గోళ్లు బాగా పెరగకపోతే జింక్‌ లోపం అనుకోవాలి. గోళ్లు వేలాడి పోతున్నట్లు, నొప్పిగా ఎర్రగా వాచినట్లుంటే ఫోలిక్‌ యాసిడ్‌ విటమిన్‌ సి వున్న ఆహారాలు తినాలి. చిక్కుళ్లు, నారింజ, నిమ్మ, జామ, ఉసిరి, ఆకుకూరలు తినాలి.