శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 22 అక్టోబరు 2019 (16:40 IST)

ఆహారశుద్ధి రంగంలో రాష్ట్ర స్థాయి స్క్రీనింగ్ కమిటీ ఆమోదం

రాష్ట్రంలో ఆహార శుద్ధి రంగంలో 21 ప్రాజెక్టులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన గల రాష్ట్ర స్థాయి ఎంపవర్డ్ కమిటీ(ఎస్ఎల్ఇసి) ఆమోద ముద్ర వేసింది. అమరావతి సచివాలయంలో సిఎస్ అధ్యక్షతన ఆహార శుద్ధి సొసైటీకి సంబంధించి రాష్ట్ర స్థాయి స్క్రీనింగ్ కమీటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న 21 ఆహార శుద్ధి పరిశ్రమల యూనిట్లకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ మంజూరుకు మరియు వాటి ఏర్పాటుకు తగిన ఆమోదం తెలిపారు. 
 
వాటిలో ముఖ్యంగా నూతన ఆహార శుద్ధికి సంబంధించిన 15 యూనిట్లు, ప్రైమరీ ప్రాసెసింగ్‌కు సంబంధించిన ఒక యూనిట్ కు ష్ప్రింగ్ ప్రాసెసింగ్‌లో కోల్డ్ చైన్‌కు సంబంధించిన 2 యూనిట్లకు, టెక్నాలజీ అప్ గ్రేడేషన్‌కు సంబంధించిన 2 యూనిట్లకు, అదేవిధంగా ఒక మెగా పుడ్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి ఈ సమావేశంలో ఆమోదం తెలిపారు. 
 
ఆమోదించిన ప్రాజెక్టుల్లో కృష్ణా జిల్లాల్లో కొబ్బరి ప్రాసెసింగ్ యూనిట్, ష్ప్రింప్ ప్రాసెసింగ్ యూనిట్, చిత్తూర్ జిల్లాల్లో కోల్డ్ ప్రెస్డ్ ఫ్రెష్ జ్యూస్ బాటిలింగ్ యూనిట్, ప్రూట్ ఫల్ప్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్, జీపిపిక్కల ప్రాసెసింగ్ యూనిట్, తూర్పు గోదావరి జిల్లాలో పోర్టిఫైడ్ రైస్ ప్రాసెసింగ్ యూనిట్, పామ్ ఆయిల్ రిఫైనరీ, గుంటూర్ జిల్లాలో హెర్బల్ ఎక్సట్రాక్ట్స్ ఆగ్రో కమోడిటీస్ యూనిట్, స్పైస్ ప్రాసెసింగ్ యూనిట్, మెంధాల్ ఎలైడ్ ప్రాజెక్టు, కడప జిల్లాలో పీనట్ ప్రాసెసింగ్ యూనిట్, విశాఖ జిల్లాలో జీడిపిక్కల ప్రాసెసింగ్ యూనిట్, కర్నూల్ జిల్లాలో బొప్పాయి ప్రాసెసింగ్ యూనిట్, విజయనగరం జిల్లాలో బేకరీ యూనిట్ తదితర ప్రాజెక్టులున్నాయి. 
 
అలాగే తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం రామేశ్వరంపేట వద్ద 1679 కోట్ల రూ.ల వ్యయంతో మెగా పుడ్ పార్కు ఏర్పాటుకు ఈ రాష్ట్ర స్థాయి ఎంపవర్డ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సిఎస్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వివిధ ఆహార శుద్ధి పరిశ్రమలను కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు స్పష్టం చేశారు. 
 
అంతేగాక ఆమోదించిన ఆయా యూనిట్లను సకాలంలో నెలకొల్పి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర స్థాయి నైపుణ్య శిక్షణ సంస్థతో సమన్వయం చేసుకుని అవసరమైన శిక్షణను అందించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఎపి ఫుడ్ ప్రాసెసింగ్ సంస్ధ కార్యదర్శి కాంతిలాల్ దండే, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, పుడ్ ప్రాసెసింగ్ సంస్థ సిఇఓ ఎల్.శ్రీధర్ రెడ్డి, సంస్థ అధికారులు పాల్గొన్నారు.