శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 అక్టోబరు 2019 (11:29 IST)

రూ.2,44,941.30 ఇదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు అయింది. 13 జిల్లాలతో నవ్యాంధ్ర ఏర్పాటైంది. అలాగే, 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఆవిర్భవించింది. అయితే, నవ్యాంధ్రకు ఇపుడు మొత్తం 2.45 లక్షల కోట్ల రూపాయలకుపైగా అప్పులున్నట్టు తేలింది. వీటిని వడ్డీతో సహా తీర్చాలంటే 2040 వరకూ సమయం పడుతుందని ఆర్థిక శాఖ లెక్కలు కట్టింది. 
 
బహిరంగ మార్కెట్ నుంచి తీసుకున్న రుణాలు, విదేశాల సాయం, నాబార్డ్, విద్యుత్ సంస్థల నుంచి తీసుకున్న రుణాలన్నీ కలుపగా, మొత్తం రూ.2,44,941.30 కోట్ల రూపాయలుగా తేలింది. ఈ మొత్తం రుణాల్లో బహిరంగ మార్కెట్ నుంచి రూ.1.55 లక్షల కోట్లు, కేంద్రం నుంచి తీసుకున్న రూ.10,229 కోట్లు ఉన్నాయి. 
 
అలాగే, చిన్న మొత్తాల పొదుపు ఖాతాల ద్వారా రూ.12,504 కోట్లు, ప్రావిడెంట్ ఫండ్ తదితరాల నుంచి రూ.14,767 కోట్లు, డిపాజిట్లు, రిజర్వ్ నిధులు రూ.52,064 కోట్లు ఉన్నాయని ఆర్థిక శాఖ తేల్చింది. నాబార్డ్ నుంచి, 'ఉదయ్' పథకం కింద తీసుకున్న రుణాలను 2030-31 వరకూ తీర్చివేయవచ్చని, మిగతా మొత్తం తీరాలంటే, ఇంకో పదేళ్ల వరకూ పడుతుందని అంచనా వేస్తున్నారు.