1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By chitra
Last Updated : గురువారం, 7 జులై 2016 (16:31 IST)

మొలకలు తినండి.. బట్టతలకు చెక్ పెట్టండి..!

మనం తీసుకునే ఆహారంలో చాలావరకు పోషకవిలువలు ఉండేలా చూసుకోవాలి. మొలకలలో పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. మొలకలలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి 1, విటమిన్ బి 6, విటమిన్ కె ఉంటాయి. అంతే కాకుండా ఐరన్, ఫాస్ఫ

మనం తీసుకునే ఆహారంలో చాలావరకు పోషకవిలువలు ఉండేలా చూసుకోవాలి. మొలకలలో పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. మొలకలలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి 1, విటమిన్ బి 6, విటమిన్ కె ఉంటాయి. అంతే కాకుండా ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాసియం, మాంగనీసు, కాల్షియం కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇంకా పీచు, ఫోలేట్ మరియు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉన్నాయి. మొలకలు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వాటి మేలేంటో ఇప్పుడు చూద్దామా...
 
మొలకలలో ఎక్కువగా ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల బరువు సులభంగా తగ్గుతుంది. శరీరంలో మెటబాలిజం స్థాయిని పెంచుతుంది. శరీరంలో టాక్సిన్స్‌ను బయటకు పంపటంలో సహకరిస్తుంది.
 
మొలకలలో మన శరీరానికి కావలసిన ఎంజైములు సమృద్ధిగా ఉన్నాయి. ఉడికించిన ఆహారపదార్థాలలో ఎంజైములు నశించిపోతాయి. అదే మొలకలను తింటే పూర్తీ స్థాయిలో ఎంజైములు శరీరానికి లభిస్తాయి.
 
మొలకలలో మాంసకృతులు అధికంగా ఉంటాయి. వీటిని రోజూ వారి డైట్‌లో చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన మాంసకృతులు లభిస్తాయి. ఫ్యాటీ యాసిడ్స్ మనం తీసుకునే ఆహారంలో తక్కువగా ఉంటుంది. అందుచేత మొలకల్లో ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వలన వీటిలో ఉండే న్యూట్రీషియన్స్ శరీరానికి మేలు చేస్తాయి.
 
మొలకలు తొందరగా జీర్ణమయ్యే గుణం ఉంది. మొలకలు తినటం వలన జీర్ణసంబంధ, కడుపు ఉబ్బరం సమస్య ఉన్నవారికి చాల ఉపయోగకరంగా ఉంటుందని డైటీషన్లు అంటున్నారు. మొలకలలో విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. విటమిన్ సి వలన వెంట్రుకలు పొడవుగా పెరుగుతాయి. ఫ్రీరాడికల్స్ నివారించి వెంట్రుకలు పెరగటానికి తోడ్పడుతుంది. సహజంగా మగవారిలో బట్టతల, అలోపేసియాను నియంత్రిస్తుంది.