సోమవారం, 18 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By chitra
Last Updated : శనివారం, 15 అక్టోబరు 2016 (12:16 IST)

హెడ్‌ఫోన్స్‌ వినియోగంతో వినికిడి లోపం!

సెల్‌ఫోన్ల పుణ్యమా అంటూ.. హెడ్‌ఫోన్స్‌ను చాలామంది తెగ వాడేస్తున్నారు. బస్సుల్లో వెళ్లే సమయంలోను, నడిచేటప్పుడు, ఖాళీ సమయాల్లోను టైంపాస్‌ కోసం పాటలు వినేందుకు మనం ఆసక్తి చూపుతాం. ఇలా వినేందుకు ఇప్పుడు హ

సెల్‌ఫోన్ల పుణ్యమా అంటూ.. హెడ్‌ఫోన్స్‌ను చాలామంది తెగ వాడేస్తున్నారు. బస్సుల్లో వెళ్లే సమయంలోను, నడిచేటప్పుడు, ఖాళీ సమయాల్లోను టైంపాస్‌ కోసం పాటలు వినేందుకు మనం ఆసక్తి చూపుతాం. ఇలా వినేందుకు ఇప్పుడు హెడ్‌ఫోన్స్‌ వాడకం ఎక్కువైపోతోంది. 
 
అయితే హెడ్‌ఫోన్స్‌ వాడడం వల్ల వినికిడి శక్తి తగ్గే ప్రమాదముందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. న్యూయార్క్‌ ఆరోగ్య విభాగం జరిపిన సర్వేలో హెడ్‌ఫోన్స్‌ని అధికంగా ఉపయోగించడం వల్ల చెవులకు ప్రమాదం ఉంటుందని తేలింది. 
 
ఇప్పుడు మనం చూసే జనాల్లో ఎక్కువమంది చెవుల్లో హెడ్‌ఫోన్స్‌తో కనిపిస్తుంటారు. ఇలా ఎక్కువగా హెడ్‌ఫోన్స్‌ వినియోగిస్తున్న ప్రతి నలుగురిలో ఒకరు వినికిడి సమస్యతో బాధపడుతున్నట్టు పరిశోధకులు తమ పరిశోధనలో గుర్తించారు.