సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 20 జూన్ 2018 (12:32 IST)

చక్కెర అధికంగా తింటే మెదడు ఫట్...

సాధారణంగా కొంతమంది చక్కెర లేదా బెల్లం అధికంగా ఆరగిస్తుంటారు. అలాంటి వారి మెదడు గ్రాహ్యశక్తిని తగ్గిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయంపై ఆస్ట్రేలియాకు చెందిన మార్గరెట్ మోరిస

సాధారణంగా కొంతమంది చక్కెర లేదా బెల్లం అధికంగా ఆరగిస్తుంటారు. అలాంటి వారి మెదడు గ్రాహ్యశక్తిని తగ్గిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయంపై ఆస్ట్రేలియాకు చెందిన మార్గరెట్ మోరిస్ అనే పరిశోధకురాలు జరిపిన ఓ పరిశోధనలో వెల్లడైంది.
 
ఈ పరిశోధనలో సంతృప్త కొవ్వులు, చక్కెర అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల అతి తక్కువ కాల వ్యవధిలోనే మెదడు గ్రాహ్యశక్తి తగ్గడంతోపాటు కొంత కాలానికి స్థూలంగా జ్ఞాపక శక్తిని కూడా కోల్పోవాల్సి వస్తుందని ఈ పరిశోధనలో వెల్లడైంది. 
 
ముఖ్యంగా, ఈ ప్రభావం నిల్వ ఉండే ఆహారం కూడా కనబడుతున్నట్లు ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన మార్గరెట్ మోరిస్ తెలిపారు. మెదడులో జ్ఞాపకశక్తి కేంద్రమైన హిప్పోకంపస్‌లో ఏర్పడే ఈ మార్పులు అలాంటి ఆహారం మానివేసినా కూడా మళ్ళీ బాగవుతున్నట్లు కనిపించలేదని మోరిస్ తెలిపారు.