మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By సిహెచ్
Last Updated : గురువారం, 19 నవంబరు 2020 (16:28 IST)

రోగ నిరోధక శక్తిని పెంపొందించే అశ్వగంధ పాలను ఆవిష్కరించిన హెరిటేజ్‌ ఫుడ్స్‌

రోగ నిరోధక శక్తిని పెంపొందించే అల్లం, తులసి మరియు పసుపు రకపు పాలను విడుదల చేసిన తరువాత హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఇప్పుడు రోగనిరోధక శక్తిని పెంపొందించే రీతిలో ఆయుర్వేద లక్షణాలను కలిగిన అశ్వగంధ పాలను విడుదల చేసింది.
 
హెరిటేజ్‌ ఫుడ్స్‌ యొక్క అశ్వగంధ పాలులో అనియా సోమ్నీఫెరాను పాలతో మిళితం చేసి అందిస్తున్నారు. పాలతో పాటుగా అశ్వగంధను మిళితం చేసి అందించడమనేది శతాబ్దాలుగా పలు రకాల సమస్యలను నివారించే ఆయుర్వేద చికిత్సగా భావిస్తున్నారు. ఆయుర్వేద వనమూలికలలో ఒత్తిడిని నివారించే అద్భుత గుణాలు అశ్వగంధలో ఉన్నాయి. ఇది మానసిక బలం పెంచడంతో పాటుగా రోగ నిరోధక శక్తినీ పెంచుతుంది.
 
స్టెరిలైజ్డ్‌ హోమోజెనైజ్డ్‌ ఫ్లేవర్డ్‌ టోన్డ్‌ మిల్క్‌ను 90 రోజుల పాటు నిల్వ చేయవచ్చు మరియు దీనిని తెరిచేంత వరకూ ఫ్రిజ్‌లో ఉంచాల్సిన అవసరం కూడా లేదు. దీనిని వేడి చేసుకుని లేదంటే చల్లబరుచుకుని తాగవచ్చు. అత్యుత్తమ ఫలితాల కోసం మైక్రోవేవ్‌ ఓవెన్‌లో 30 సెకన్ల పాటు వేడి చేసి తాగడం సూచించడమనైది.
 
హెరిటేజ్‌ అశ్వగంధ పాలలో కృత్రిమ నిల్వ పదార్థాలేవీ కలుపలేదు. ఇది ఆధునిక వాణిజ్య స్టోర్లు, ఈ–కామర్స్‌ వేదికలు, ఎంపిక చేసిన స్టాండలోన్‌ స్టోర్లు, హెరిటేజ్‌ పార్లర్లు మరియు హెరిటేజ్‌ టచ్‌ యాప్‌ వద్ద లభ్యమవుతుంది. 170 మిల్లీ లీటర్ల ఆకర్షణీయమైన పెట్‌ బాటిల్‌ ధర 30 రూపాయలు.
 
వినియోగదారుల నడుమ పండుగ సంతోషం తీసుకువచ్చేందుకు హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఇప్పుడు 4 కోన్స్‌ ఐస్‌క్రీమ్‌లను 110 మిల్లీ లీటర్ల కాంబో ప్యాక్‌లో (డబుల్‌ చాక్లెట్‌, బటర్‌స్కాచ్‌)విడుదల చేసింది. వీటితో పాటుగా చవులూరించే దీపావళి వంటకాలను తయారుచేసేందుకు10, 20 రూపాయల నెయ్యి ప్యాకెట్లను సైతం హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఆవిష్కరించింది.
 
శ్రీమతి బ్రాహ్మణి నారా, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మాట్లాడుతూ ‘‘అతి పురాతనమైన ఆయుర్వేదిక్‌ రెసిపీ అశ్వగంధ పాలను విడుదల చేయడం పట్ల ఆనందంగా ఉన్నాము. ఆయుర్వేద వనమూలికలలో రాజు అశ్వగంధ. మా వినియోగదారుల ఆరోగ్యాన్ని ఇది మెరుగుపరుస్తుందనే నమ్మకంతో ఉన్నాం.
 
చిన్న ప్యాకెట్లలో నెయ్యి అందించడం ద్వారా, ఈ పండుగ సీజన్‌లో ప్రతి గృహాన్నీ మేము చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పండుగలు మరియు ఇతర వంటకాల కోసం ఒక్కసారి మాత్రమే నెయ్యి వినియోగించాలనుకునే చిన్న కుటుంబాలను లక్ష్యంగా పెట్టుకుని వీటిని విడుదల చేశాం..’’ అని అన్నారు.