శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 11 జులై 2016 (10:28 IST)

రోజూ కాఫీ తాగుతున్నారా? చెవుడు వచ్చే ప్రమాదముంది.. ఎందుకంటే?

ప్రతి రోజూ ఉదయాన్నే లేవగానే ఓ మంచి కాఫీ తాగాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు. కాఫీ తాగనిదే వారికి రోజుకు ప్రారంభం కాదు కూడా. అయితే రోజూ కాఫీ తాగితే శాశ్వతంగా చెవుడు వచ్చే ప్రమాదముందని లండన్‌కు చెందిన మ

ప్రతి రోజూ ఉదయాన్నే లేవగానే ఓ మంచి కాఫీ తాగాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు. కాఫీ తాగనిదే వారికి రోజుకు ప్రారంభం కాదు కూడా. అయితే రోజూ కాఫీ తాగితే శాశ్వతంగా చెవుడు వచ్చే ప్రమాదముందని లండన్‌కు చెందిన మెక్‌గిల్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. కాఫీలో ఉండే కెఫిన్‌తో చెవులు మూసుకుపోతాయని తేల్చారు. 
 
పెద్ద శబ్దాలు విన్నప్పుడు పాక్షికంగా చెవుడు వచ్చినట్లు ఉన్నప్పుడు కాఫీ తాగితే ఇది మరింత ప్రమాదకరమట. శాశ్వతంగా చెవుడు వచ్చే అవకాశముందని డాక్టర్ ఫైసల్ జవావి అభిప్రాయపడుతున్నారు. ప్రతి రోజూ తాగే కాఫీలో 25 మిల్లీ గ్రాముల కెఫిన్ ఉంటే ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు. రోజూ కాఫీ తాగేవారు కెఫిన్ మూడు గ్రాములకు మించకుండా తీసుకుంటే ప్రమాదం లేదని వైద్యులు సూచిస్తున్నారు.