బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 25 జూన్ 2017 (16:59 IST)

మగ వైద్యలు.. లేడీ డాక్టర్లు ఎంత ఎంఎల్ మద్యం తీసుకోవాలి?

మగ డాక్టర్లు, ఆడ వైద్యులు ఎంత మోతాదులో మద్యం సేవించాలో ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ (ఐఎంఏ) తాజాగా త‌మ ఆఫీస్ బేర‌ర్స్‌కు గైడ్‌లైన్స్ జారీ చేసింది. అలాగే, వైద్యులు డాక్టర్లు కానివారితో కలిసి మద్యం సేవి

మగ డాక్టర్లు, ఆడ వైద్యులు ఎంత మోతాదులో మద్యం సేవించాలో ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ (ఐఎంఏ) తాజాగా త‌మ ఆఫీస్ బేర‌ర్స్‌కు గైడ్‌లైన్స్ జారీ చేసింది. అలాగే, వైద్యులు డాక్టర్లు కానివారితో కలిసి మద్యం సేవించరాదని సూచన చేసింది. 
 
డాక్ట‌ర్లు.. డాక్ట‌ర్లు కానివాళ్ల‌తో తాగ‌కూడ‌ద‌ట‌. ఎందుకూ అంటే వాళ్లు స‌మాజంలో ఆరోగ్యానికి బ్రాండ్ అంబాసిడ‌ర్ల‌లాగా ఉండాలట‌. ఇక జులై 1న డాక్ట‌ర్స్ డే, సెప్టెంబ‌ర్ 5న టీచ‌ర్స్ డే సంద‌ర్భంగా డాక్ట‌ర్లు మందుకు దూరంగా ఉండాల‌ని కూడా పిలుపునిచ్చింది. 
 
ఇకపోతే.. మడ, మగ వైద్యులు ఎంత ఆల్క‌హాల్ తీసుకోవాలో కూడా సూచించింది. మ‌గ డాక్ట‌ర్ల‌యితే 18 ఎంఎల్‌, లేడీ డాక్ట‌ర్ల‌యితే 9 ఎంఎల్ తీసుకోవాలని స‌ల‌హా ఇచ్చింది. 
 
ఆరోగ్యవంత‌మై జీవ‌న‌శైలిని పేషెంట్ల‌కు చెప్పే ముందు డాక్ట‌ర్లే వాటిని పాటించాల‌ని గట్టిగా చెప్పింది. పేషెంట్ల‌తో హుందాగా ప్ర‌వ‌ర్తించాల‌ని సలహా ఇచ్చింది.