సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By సిహెచ్
Last Updated : గురువారం, 4 మార్చి 2021 (19:13 IST)

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ, మహిళల ఆరోగ్యంపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతున్న డాక్టర్‌ బాత్రాస్‌

మహిళలు ఆరోగ్యంగా ఉండాల్సిన ఆవశ్యకత పట్ల అవగాహన కల్పించేందుకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ మహిళలందరికీ తమ తలుపులను తెరిచింది డాక్టర్‌ బాత్రాస్‌. ప్రపంచంలో అతి పెద్ద హోమియోపతి గొలుసుకట్టు సంస్ధగా గుర్తింపు పొందిన డాక్టర్‌ బాత్రాస్‌ ఇప్పుడు ఉచిత కన్సల్టేషన్‌‌ను మహిళలకు అందించడంతో పాటుగా హోమియోపతి చికిత్సలో 50% రాయితీని సైతం అందిస్తుంది. మార్చి 6 నుంచి మార్చి 8వ తేదీ వరకూ మహిళలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 200కు పైగా డాక్టర్‌ బాత్రాస్‌ క్లీనిక్స్‌ వద్ద తమ అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకోవడంతో పాటుగా నిష్ణాతులైన హోమియోపతిక్‌ వైద్య సేవలనూ పొందవచ్చు.
 
ఈ కార్యక్రమం గురించి పద్మశ్రీ అవార్డు గ్రహీత మరియు డాక్టర్‌ బాత్రాస్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ ముఖేష్‌ బాత్రా మాట్లాడుతూ, ‘‘మహిళలు తమ కుటుంబానికి అమిత ప్రాధాన్యత నివ్వడంతో పాటుగా తమకున్న ఆరోగ్య సమస్యలను మౌనంగా భరిస్తుంటారు. వర్షాకాలం కోసం ఆమె ఆదా చేసుకున్నా లేదంటే ఆర్ధిక పరిమితులతో పోరాడుతున్నా, ఆమె తరచుగా తన ఆరోగ్య సమస్యలైనటువంటి వెన్నునొప్పి, తలనొప్పి, తెల్లబట్ట, సక్రమంగా రాని ఋతుచక్రాలు మరియు ఆఖరకు మానసిక ఆరోగ్యం గురించి పట్టించుకోదు.
 
ఈ సమస్యలు చిన్నవే కావొచ్చు కానీ, వాటిని నిర్లక్ష్యం చేస్తే అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉంది. డాక్టర్‌ బాత్రాస్‌ వద్ద మేము ఆరోగ్యవంతమైన భారతావనిని సృష్టించడాన్ని నమ్ముతుంటాం. అదే రీతిలో భారతీయ మహిళల ఆరోగ్యాన్నీ పరిరక్షించాలనుకుంటున్నాం. హోమియోపతి వైద్య విధానం అత్యంత సురక్షితమైనది, సహజసిద్ధమైనది కావడంతో పాటుగా ఖర్చు పరంగా అత్యంత అందుబాటులో ఉంటుంది. మహిళల ఆరోగ్య సమస్యలన్నింటికీ ఇది తగిన పరిష్కారాలను అందిస్తుంది’’ అని అన్నారు.
 
వెన్నునొప్పి
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 540 మిలియన్ల మంది ప్రజలు నడుంనొప్పితో బాధపడుతున్నారు. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ ఇన్‌ఫర్మేషన్‌ అధ్యయనాల ప్రకారం పురుషులతో పోలిస్తే మహిళలు అధికంగా ఈ నొప్పితో బాధపడుతున్నారు. వెన్నునొప్పికి ఖచ్చితమైన కారణాలు ఏమిటనేది తరచుగా తెలియకపోవచ్చు కానీ, లుంబార్‌ స్పాండిలోసిస్‌, సైయాటికా, ఆస్టియోపొరోసిస్‌, ఆస్టియో అర్థరైటీస్‌ మరియు యాంకీలాసింగ్‌ స్పాండిలైటిస్‌ వంటి రకాలుగా ఈ నొప్పి ఉంటుంది.
 
హోమియోపతితో చికిత్స
హోమియోపతి ఔషదాలతో ఈ నొప్పి తీవ్రత తగ్గుతుంది. అలాగే సురక్షిత పద్ధతులను అవలంభించడం వల్ల మరలా ఈ నొప్పిరాకపోవడం మరియు అధిక కాలం పాటు నొప్పి లేకపోవడం జరుగుతుంది. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ ఇన్‌ఫర్మేషన్‌ నిర్వహించిన డబుల్‌ బ్లైండ్‌, ప్లాసెబో కంట్రోల్డ్‌ ట్రయల్‌లో 18 నుంచి 75 సంవత్సరాల వయసు కలిగిన 248 మంది రోగులను పరిశీలించారు. వీరిలో 228 మంది వ్యక్తులకు ర్యాండమైజ్డ్‌గా, 221 మందికి చికిత్సను ఆరంభించారు. వీరిలో 192మందిని పరీక్షించారు. ఈ పరీక్షా ఫలితాలు వెల్లడించిన దాని ప్రకారం, హోమియోపతి చికిత్సతో పాటుగా అల్లోపతిక్‌ విధానంతో దీర్ఘకాలం వెన్ను నొప్పితో బాధపడుతున్న రోగులలో మెరుగైన ఫలితాలు కనిపించాయి. వెన్ను సమస్యలకు మరియు పలు ఇతర మస్క్యులో స్కెలెటల్‌ పరిస్థితులకు మూల కారణాలను తెలుసుకుని చికిత్సనందించడం ద్వారా విస్తృత శ్రేణి అవకాశాలను హోమియోపతి అందిస్తుంది.
 
తలనొప్పి
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం, తలనొప్పి అనేది అతి సాధారణ నాడీ సంబంధిత రుగ్మత. ప్రపంచవ్యాప్తంగా 1.7% నుంచి 4% మంది ప్రజలు ఈ సమస్యతో బాధపడుతుంటే వారిలో 3% మంది భారతీయులు. భారతదేశంలో, పురుషులలో 10.9% మంది మరియు స్త్రీలలో 21.8% మంది మైగ్రేన్‌తో బాధపడుతున్నారు.
 
హార్మోన్లలలో సమతుల్యత లోపించడం వల్ల అతి తీవ్రమైన తలనొప్పి రావడంతో పాటుగా మహిళలలో మెనస్ట్రుల్‌ మైగ్రేన్స్‌ కూడా వస్తుంటాయి. సాధారణంగా తలనొప్పి మూడు రకాలుగా ఉంటుంది. అది మైగ్రేన్స్‌, క్లస్టర్‌ హెడెక్స్‌ మరియు టెన్షన్‌ హెడెక్స్‌. ఇవికాక తీవ్రమైన సైనటిస్‌, చెవి ఇన్‌ఫెక్షన్స్‌, అధిక రక్తపోటు, ట్రిజెమినల్‌ న్యూరాల్జియా, బ్రెయిన్‌ ట్యూమర్స్‌ మరియు మెనిన్‌గిటిస్‌ వంటి వాటిని సెకండరీ తలనొప్పి కారకాలుగా భావిస్తుంటారు. ఇవి పరిస్థితిని మరింత దిగజార్చేలా చేస్తాయి. హోమియోపతితో తలనొప్పిలకు ప్రభావవంతంగా చికిత్స అందించవచ్చు
 
హోమియోపతి చికిత్సతో తలనొప్పి తీవ్రత తగ్గుతుంది. అలాగే మరలా రావడం కూడా తగ్గడంతో పాటుగా అధిక సమయం పాటు ఈ తలనొప్పి రాకుండా సురక్షితంగా, సహజసిద్ధమైన చికిత్స అందిస్తుంది. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ ఇన్‌ఫర్మేషన్‌ అధ్యయనాల ప్రకారం, దాదాపు 8 సంవత్సరాల పాటు 3,709 మంది రోగులను సుదీర్ఘకాలం పాటు తీవ్రమైన తలనొప్పి సమస్యలను గురించి పరిశీలించడం జరిగింది. ఈ అధ్యయనంలో 2722 మంది పెద్దవారు, 819 మంది చిన్నారులు ఉన్నారు. ఈ ఫలితాలు వెల్లడించిన దాని ప్రకారం 75% మంది చిన్నారులు, 74.3% మంది మహిళలు మరియు67.2% మంది పురుషులలో హోమియోపతి చికిత్స తరువాత పరిస్థితి మెరుగుపడింది.
 
డిప్రెషన్‌
మానసిక ఆరోగ్య సమస్యలలో సాధారణ జలుబులా డిప్రెషన్‌ను భావిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్ల మంది ప్రజలపై ఇది ప్రభావం చూపుతుంది. పురుషులతో పోలిస్తే స్త్రీలు రెట్టింపు సంఖ్యలో దీని బారిన పడుతున్నారు. బయోలాజికల్‌, హార్మోనల్‌ మార్పులు కారణంగా స్త్రీలు ఈ డిప్రెషన్‌ బారిన పడుతున్నారు. పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌ దీనికి ఓ ఉదాహరణ.
 
గత సంవత్సరం మహిళలలో మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతుండటాన్ని మేము చూశాము. లాక్‌డౌన్‌ కారణంగా పనిభారం పెరగడంతో కోవిడ్ 19 మహమ్మారి పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఎక్కువ ప్రభావం చూపింది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ సమయంలో, క్వారంటైన్‌, జీతాల కోతలు, నిరుద్యోగం, గందరగోళం, భయం, హింస, వేధింపులు మొదలైనవి మహిళల్లో ఆందోళన, న్యూనతను పెంచాయి. గృహహింస బాధితులకు పరిస్థితిని మరింతగా లాక్‌డౌన్‌ దిగజార్చించిందని నేషనల్‌ కమిషన్‌ ఆఫ్‌ ఉమెన్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 23 మరియు 30 తేదీల నడుమ మార్చి 2020లో  మహిళల నుంచి ఫిర్యాదులు గణనీయంగా పెరిగాయి. ఈ వారంలో మొత్తంమ్మీద 214 ఫిర్యాదులు వస్తే వాటిలో 58 కేవలం గృహ హింసకు సంబంధించినవి (ఇండియా టుడే, 31 మార్చి 2020)
 
హోమియోపతి మరియు మానసిక ఆరోగ్యం
హోమియోపతి అత్యంత సురక్షితమైనది. వైద్య పరంగా దుష్పరిణామాలు కూడా ఉండవు. హోమిమోపతి డాక్టర్‌ ఓ వ్యక్తి ఏ తరహా డిప్రెషన్‌తో బాధపడుతున్నారో గుర్తించి, ఆ సమస్యకు తగిన చికిత్స అందిస్తారు. ప్రతి వ్యక్తీ పూర్తిగా విభిన్నమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అందువల్ల ప్రతి ఒక్కరినీ పరిశీలించిన తరువాత మాత్రమే చికిత్స అందిస్తారు. డిప్రెషన్‌కు కనిపించే లక్షణాల ఆధారంగా మాత్రమే కాకుండా వారి వ్యక్తిత్వం, వారి స్వభావంతో పాటుగా సంభావ్య ఆరోగ్య ప్రభావాలను సైతం పరిగణలోకి తీసుకుని చికిత్స అందిస్తారు.
 
నిర్వహించిన క్లీనికల్‌ అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం ఒత్తిడి మరియు ఆందోళనతో బాధ పడుతున్న 58% మంది హోమియోపతి చికిత్సతో ప్రయోజనం పొందారు. శరీరం, మనసుకు సంబంధించి సమగ్రమైన వైద్య శాస్త్రంగా హోమియోపతిని భావిస్తున్నారు. మహమ్మారి ఆరంభమైన సమయంలో, డిప్రెషన్‌ కేసులు దాదాపు 20% పెరిగాయి మరియు భయం నుంచి ఆందోళన కూడా పెరిగింది (ఇండియన్‌ సైక్రియాట్రిక్‌ సొసైటీ)
 
డాక్టర్‌ బాత్రాస్‌ వద్ద మేము ఇప్పటి వరకూ నాలుగు లక్షల మందికి పైగా మహిళలకు పలు ఆరోగ్య సమస్యల కోసం చికిత్స అందించాం. వీరిలో దాదాపు 1.6 లక్షల మంది క్రమ రహిత ఋతుచక్రంతో బాధపడుతున్న వారు, దాదాపు 80 వేల మంది తలనొప్పి మరియు వెన్ను నొప్పితో బాధపడుతున్న రోగులు మరియు తెల్లబట్ట, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 40 వేల మంది మహిళా రోగులకు చికిత్స అందించాము.
 
మహిళల ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన మెరుగుపరిచేందుకు డాక్టర్‌ బాత్రాస్‌ ఇప్పుడు ప్రత్యేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఆఫర్‌ను ప్రకటించింది. హోమియోపతి డాక్టర్‌తో ఉచితంగా కన్సల్టేషన్‌ను పొందండి మరియు వార్షిక హోమియోపతి చికిత్సపై 50% రాయితీ అందుకోండి. ఈ ఆఫర్‌ కేవలం మార్చి 6,7, 8 తేదీలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌ పొందడం కోసం మీ దగ్గరలోని డాక్టర్‌ బాత్రాస్‌ క్లీనిక్‌ను సంప్రదించండి.