1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 25 మే 2017 (11:01 IST)

వామ్మో... ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరికి థైరాయిడ్... నిజమా?

మొన్నటివరకు ఎయిడ్స్, కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు దేశాన్ని పట్టిపీడిస్తే... ఇపుడు థైరాయిడ్ భారతీయులను కబళిస్తోంది. ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నట్టు తేలింది. వీరిలో

మొన్నటివరకు ఎయిడ్స్, కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు దేశాన్ని పట్టిపీడిస్తే... ఇపుడు థైరాయిడ్ భారతీయులను కబళిస్తోంది. ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నట్టు తేలింది. వీరిలో కూడా ఎక్కువగా మహిళలే ఉన్నారు. ఈ వివరాలను ఎస్ఆర్ఎల్ డయాగ్నోస్టిక్స్ అనే సంస్థ వెల్లడించింది. 
 
బరువు పెరగడంతో పాటు, హార్మోన్ల అసమతౌల్యం వల్ల ఈ సమస్య ఎదురవుతున్నట్టు సర్వేలో తేలింది. థైరాయిడ్ లోపంతో బాధపడేవారు శారీరక బలహీనతకు లోనవుతారని... బరువు పెరగడం, డెప్రెషన్, అలసట, కొలెస్టరాల్ పెరగడం వంటి సమస్యలతో బాధపడతారని డాక్టర్లు చెప్పారు. 
 
2014-16 మధ్య కాలంలో ఈ సంస్థ 33 లక్షల మందిపై సర్వే నిర్వహించగా ఈ చేదువార్త తెలిసింది. హైపో థైరాయిడిజం ఉత్తర భారతంలో ఎక్కువగా ఉందని.. మధ్యస్తమైన సబ్ క్లినికల్ థైరాయిడిజం తూర్పు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందని తెలిపారు. 
 
సబ్ క్లినికల్ థైరాయిడిజం చాపకింద నీరులా సైలెంట్‌గా మన దేశంలో వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పురుషుల కంటే మహిళలు 8 రెట్లు అధికంగా థైరాయిడ్ బారిన పడే అవకాశం ఉందని చెప్పారు.