మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: గురువారం, 4 సెప్టెంబరు 2014 (15:07 IST)

సెక్స్ బోరింగ్‌గా ఉందట... నా నుంచి బ్రేక్ కావాలని వెళ్లిపోతానంటోంది....

నా వయసు 27 ఏళ్లు. కాలేజీ డేస్ లో అందమైన అమ్మాయిని ప్రేమించాను. ఆమె నేను కలిసే ఉంటున్నాము. రోజుకు కనీసం ఆమెతో 3 సార్లు సెక్స్ చేయనిదే ఉండలేను. మాకు పాప పుట్టింది. పాపకు మూడేళ్లు. పాప పుట్టాక ఆమెతో మూడుసార్లు కంటే ఎక్కువసార్లు సెక్స్ చేస్తున్నాను. ఐతే హఠాత్తుగా ఇటీవల నాతో సెక్స్ బోర్ కొడుతోందనీ, నా నుంచి వెళ్లిపోతానని అంటోందామె. ఆమెకు సెక్సుపై ఎందుకు ఇలా అనాసక్తి కలిగిందో తెలియడంలేదు. ఆమె లేకుండా, ఆమెతో సెక్స్ చేయకుండా ఉండలేను. ఆమె నావద్ద ఉండేట్లు లేదు.... ఏం చేయాలి?
 
ఆమె బ్రేక్ ఎందుకు అడిగిందన్నది మీరు బాగా ఆలోచన చేస్తే తెలుస్తుంది. ఇకపోతే ఆమెను మీరు పెళ్లి చేసుకున్నారో లేదో స్పష్టంగా తెలియడంలేదు. మీ ఇద్దరు కేవలం కలిసి ఉండటం వల్ల... అంటే పెళ్లి కాకుండా సహజీవనం చేసి ఉంటే, ఆమె మీ నుంచి వెళ్లిపోవడం చాలా సులభం. ఇటీవలి కాలంలో ఆమెకు మీకు మధ్య ఏమైనా సమస్యలు తలెత్తాయోమో చెక్ చేసుకోండి. ఆమెను సెక్స్ కోసమే అన్నట్లు చూడకుండా ప్రేమాప్యాయతలతో అసలు మీ నుండి ఎందుకు దూరంగా వెళ్లాలనుకుంటుందో కనుక్కోండి.