ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: బుధవారం, 17 అక్టోబరు 2018 (22:44 IST)

పెళ్లయిన కొత్త జంటలు అంత ఉత్సాహంగా వుండటానికి అదే కారణం...

వివాహమైన కొత్త జంటలు చాలా ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యకరంగా ఉంటారు. దీనికి కారణం... శృంగారమేనట. భార్యాభర్తల శృంగారం సంతోషంగానూ, చురుకుగా ఉండడానికి సహాయపడుతుంది. శృంగారంలో పాల్గొనడం వల్ల శరీరంలోని అనేక హానికర క్రిములను నశింపజేసే శక్తి ఉత్పన్నమవుతుందట.
 
తాజా అధ్యయనాల్లో తేలిందేమిటంటే... శృంగార సమయంలో మెదడులో రసాయన సమ్మేళనాలు విడుదలై శరీరానికి విశ్రాంతినిచ్చే సంకేతాన్ని పంపుతాయి. పిట్యూటరీ అని పిలవబడే ప్రధాన సమ్మేళనం మహిళల యొక్క రక్తప్రవాహంలోకి విడుదలై ఒత్తిడిని తగ్గిస్తుందట. ఈ హార్మోన్ ప్రభావం ప్రశాంతత భావనను పెంపొందించటానికి బలంగా తోడ్పడుతుందట. ఇది వ్యవస్థను బాగా ఉంచటం ద్వారా మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. 
 
రోగ నిరోధక వ్యవస్థ బాగా మెరుగుపడుతుంది. ఇది శరీరం కోసం ఒక మంచి వ్యాయామం అని చెప్పవచ్చు. అలాగే రోగ నిరోధక వ్యవస్థను కూడా బాగా పెంచుతుంది. గుండెలో రక్తం పంపింగ్ బాగా ఉండుట వలన యాక్టివ్ అనుభూతిని కలిగిస్తూ.. అనేక ఆరోగ్య సమస్యల మీద పోరాటం చేస్తుంది. శృంగారంలో పాల్గొనని వారిలో కంటే, ఒక వారంలో రెండు కంటే ఎక్కువ సార్లు పాల్గొనే పురుషులలో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. 
 
శృంగారంలో వున్న ఇతర ఆరోగ్య ప్రయోజనాలలో ఇది ఒకటి. ట్రెడ్మిల్ మీద నడుస్తున్న లేదా వ్యాయామశాలలో బరువులు ఎత్తడం చేసినప్పుడు వెన్నెముక కింది భాగంలో నిరంతరం కదలికలు ఉంటాయి. కాళ్ళు చేతుల తిమ్మిరులు తగ్గుతాయి. శృంగారం కడుపు ఉబ్బరం వంటి వాటిని నయం చేసే శక్తి కూడా ఉంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచి, శరీరంలో వ్యాధిని నిరోధించడానికి సహాయపడుతుంది. ఒక ఉద్వేగ సమయంలో విడుదల అయ్యే ఆక్సిటోసిన్ మంచి నిద్రకు సహాయపడుతుంది. నిద్ర లేని రాత్రులు ఉంటే, ఉద్వేగ సమస్యను పరిష్కరించడానికి సహాయం చేస్తుంది.