బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Updated : శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (21:56 IST)

చెర్రీ పండ్లు తింటే జరిగే మేలు ఏమిటి? (video)

Cranberry | fruit
చెర్రీ పండ్లను రోజూ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పొటాషియం, ఐరన్, మాంగనీస్ చెర్రీ పండ్లలో ఉన్నాయి. వంద గ్రాముల చెర్రీ పండ్లలో 1677.6 మిల్లీ గ్రాముల విటమిన్ సి, విటిమిన్ ఎ కలవు. చెర్రీ పండ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
చెర్రీ పండ్లలో విటమిన్స్, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి.
 
వ్యాధి నిరోధక శక్తిని పెంచే చెర్రీ పండులో సైక్లో ఆక్సిజన్ 1, 2లు ఉన్నాయి.
 
చెర్రీ పండ్లను తీసుకోవడం ద్వారా పేగు, కిడ్నీ సంబంధిత వ్యాధులను అడ్డుకోవచ్చు
 
చెర్రీలోని పొటాషియం గుండె సంబంధింత వ్యాధులు, గుండె పోటును దూరం చేస్తుంది.
 
గుండె చప్పుడును మెరుగుపరిచే ఈ చెర్రీ పండ్లు రక్తపోటును సక్రమంగా ఉంచుతాయి.
 
పీచు పదార్థాలు కలిగివుండే చెర్రీ పండ్లలో యాంటీయాక్సీడెంట్లు ఉన్నాయి.
 
చెర్రీలను తీసుకుంటే కీళ్ల నొప్పులు, కండరాలు పట్టేయడం, క్యాన్సర్, వృద్ధాప్య ఛాయలు దరిచేరనివ్వవు.