ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (12:24 IST)

రోజూ జీడిపప్పు తినవచ్చా?

Cashew nuts
జీడిపప్పు తింటే కొవ్వు పెరుగుతుందని చాలామందికి అపోహ వుంది. అలాగే రోజుకి ఎన్ని జీడిపప్పులు తినవచ్చు అనే సందేహం కూడా చాలామందిలో కలుగుతుంటుంది. ఈ జీడిపప్పు బీపీ వున్నవారు తినవచ్చా? ఇది ఆరోగ్యానికి చేసే ప్రయోజనము ఏమిటో తెలుసుకుందాము.
 
జీడిపప్పులో సున్నా కొలెస్ట్రాల్ ఉంటుంది.
 
కొలెస్ట్రాల్ వుండదు కనుక గుండెకు ఎలాంటి హాని చేయదు.
 
మెగ్నీషియం నిల్వలు అధికంగా ఉండటంతో ఎముకలు పుష్టికి దోహదపడుతాయి.
 
మన శరీరానికి సుమారు 300 నుంచి 750 మిల్లీగ్రాముల మెగ్నీషియం అవసరం, కనుక జీడిపప్పు తీసుకుంటే మేలు.
 
సోడియం శాతం తక్కువగా వుంటుంది కనుక బీపీ ఉన్నవారు కూడా జీడిపప్పును తినవచ్చు.
 
కేన్సర్ సమస్యను అడ్డుకునే యాంటి ఆక్సిడెంట్లను జీడిపప్పు కలిగి ఉంది.
 
రోజుకు 5 నుంచి 10 వరకూ మాత్రమే జీడిపప్పులను తీసుకోవచ్చు.