శనివారం, 2 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 డిశెంబరు 2022 (11:24 IST)

ఎల్ఐసీ రుణదాతలకు షాక్.. ఏంటో తెలుసా?

LIC
LIC
ఎల్ఐసీ రుణదాతలకు షాకిచ్చింది. ఎల్ఐసీకి చెందిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ తాజాగా రుణరేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఎల్ఐసీ (LIC) హెచ్ఎఫ్ఎల్ నుంచి లోన్ (Loan) తీసుకున్న వారికి కష్టాలు తప్పేలా లేవు. 
 
డిసెంబర్ 26 నుంచిపెంచిన కొత్త రేట్లు అమలులోకి వస్తాయని తెలిపింది. ఆర్బీఐ కీలక పాలసీ రేటును పెంచుకుంటూ వెళ్లడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. 
 
ఎల్ఐసీ హౌసింగ్ ప్రైమ్ లెండింగ్ రేటు 35 బేసిన్ పాయింట్ల మేర పెరిగింది. రేట్ల పెంపు తర్వాత.. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు 8.65 శాతం నుంచి ప్రారంభం అవుతోంది.