ఎమిరేట్స్ విమానంలో అనూహ్య ఘటన... టేకాఫ్ అయిన 45 నిమిషాల తర్వాత..?
దుబాయ్ నుంచి బ్రిస్బేన్ వెళ్తున్న ఎమిరేట్స్ విమానంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఆకాశంలో ఎగురుతున్న విమానానికి రంధ్రం పడింది. ప్రయాణీకులు రంధ్రం వున్నట్లు గమనించారు.
టేకాఫ్ అయిన 45 నిమిషాల తర్వాత పేలుడు లాంటి శబ్ధం వినిపించిందని.. దీనిపై సిబ్బంది ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆ విమానం సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంది.
ప్రమాద తీవ్రత రంధ్రం పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. రంధ్రం చాలా చిన్నదిగా ఉంటే.. అప్పుడు ఫ్లైట్ లోపల ఒత్తిడి ఎక్కువగా ప్రభావితం కాదు. దీని కారణంగా బ్యాలెన్స్ క్షీణించదు. దీంతో ఈ విమానం కూడా ప్రమాదం నుంచి తప్పించుకుని వుంటుందని అంచనా వేస్తున్నారు.