శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By మోహన్
Last Updated : గురువారం, 21 మార్చి 2019 (18:41 IST)

ఉసిరికాయతో చర్మ సౌందర్యం..

ఎండాకాలం ప్రారంభమైంది. ఎండలో తిరగాలంటే మహిళలు చాలా విసుగు చెందుతుంటారు. మరోపక్క చర్మం సౌందర్యం గురించి చాలా బాధపడుతుంటారు. అలాంటి వారి కోసం ఉరిసికాయ ఒక ఔషధంలాగా పని చేస్తుందట. ప్రకృతి నుంచి సహజసిద్ధంగా లభించే ఉసిరికాయలకు చర్మ సమస్యలను నయం చేసే శక్తి ఉంది. ఉసిరికాయ ముఖం మీద మొటిమలు, మచ్చలు తగ్గించి చర్మాన్ని మెరిసేటట్లు చేస్తాయట.
 
ఉసిరికాయ వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోండి.
 
* ఉసిరికాయను మిశ్రమంగా చేసి ముఖానికి పట్టించాలి. 15 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత కడగాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల చర్మంపై మొటిమలు తిరిగి రాకుండా చేస్తుంది.
 
* ఉసిరి శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసే సహజ పదార్థంగా పనిచేస్తుంది. అంతేకాకుండా చర్మంపై దాడి చేసేటువంటి సూక్ష్మజీవులను నిర్మూలించి చర్మవ్యాధులను అరికడుతుంది.
 
* ఉసిరిలో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉన్నందున చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.
 
* ఉసిరికాయ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ముఖంలోని నల్లని మచ్చలు, ముడతలు, సన్నని గీతలు వంటి వృద్ధాప్య సంకేతాలు తగ్గుముఖం పడుతాయి.
 
* ప్రతిరోజూ ఉసిరికాయను ఉపయోగించడం ద్వారా చర్మంపై ఉన్న మచ్చలు, పిగ్మెంటేషన్‌ను తేలికగా తగ్గించవచ్చు.
 
* ఉసిరికాయలో సమృద్ధిగా ఉండే యాంటీ-ఆక్సిడెంట్‌లు మంచి ఔషధంగా పనిచేస్తాయి.
 
* ఉసిరిలో ఉండే విటమిన్ సి చర్మాన్ని ప్రకాశవంతంగా చేసి నూతన కాంతినిస్తుంది. ఉసిరిక రసాన్ని చర్మానికి ప్యాక్‌లా వేసుకోవాలి. అలా చేయడం వల్ల మేనిఛాయను తేలికపరిచి, మచ్చలేని చర్మంతో పాటు మరింత ప్రకాశవంతం చేస్తుంది.