మంగళవారం, 29 ఏప్రియల్ 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : గురువారం, 6 ఏప్రియల్ 2017 (12:00 IST)

వేసవిలో శరీర ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉండాలంటే...

వేసవికాలంలో శరీర ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో ఉండాలంటే నీళ్లు తాగడాన్ని మించిన పరిష్కారం మరోటి లేదు. అలాగని ఒకేసారి నీటిని గటగటా తాగడం వల్ల లాభంలేదు. అందుకు కొన్ని టెక్నిక్స్‌ ఉన్నాయి.

వేసవికాలంలో శరీర ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో ఉండాలంటే నీళ్లు తాగడాన్ని మించిన పరిష్కారం మరోటి లేదు. అలాగని ఒకేసారి నీటిని గటగటా తాగడం వల్ల లాభంలేదు. అందుకు కొన్ని టెక్నిక్స్‌ ఉన్నాయి. 
 
అదేసమయంలో ఒకేసారి ఎక్కువ నీటిని తాగకూడదు. కొద్దికొద్దిగా తాగాలి. ఒకేసారి లీటరు నీళ్లు తాగితే శరీరం అవసరమైనన్ని నీళ్లను తీసుకోదు. అందుకని ప్రతి 20 నిమిషాలకి ఒకసారి వంద మిల్లీలీటర్ల నీటిని తాగుతుండాలి. ఇలా చేస్తే వేడి వల్ల శరీరం కోల్పోయే నీటిని తిరిగి శరీరానికి అందించే ప్రక్రియ సరిగా జరుగుతుంది.
 
అయితే, నీళ్లు తాగమన్నారు కదా అని ఇతర ద్రవపదార్ధాలు తాగకూడదు. ముఖ్యంగా టీ, కాఫీ, సోడా, ఆల్కహాల్‌ వంటివి నీటికి ప్రత్యామ్నాయాలు కాదు. వీటన్నింటికీ కూడా శరీరంలో నీటిని బయటకు పంపించే లక్షణం ఉంది. దానివల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందే తప్ప మరో లాభంలేదు. అందుకే 'సే నో టు అదర్‌ డ్రింక్స్'. కేవలం నీటిని మాత్రమే తాగాలి.