Daily Horoscope
✕

తెలియకుండానే లావైపోతారు... తగ్గటాన్ని మాత్రం తెలుసుకోరూ... ఇవి చేస్తే...

Updated: మంగళవారం, 16 అక్టోబరు 2018 (17:19 IST)
మనం తీసుకుంటున్న ఆహారంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. వేళకు సరైన ఆహారం తీసుకోకుండా సమయానికి అందుబాటులో ఉన్నది ఏదో ఒకటి తీసుకుని భోజనం అయిందని అనిపిస్తాం. నిజానికి ఇలాంటి ఆహారం వల్లే స్థూలకాయం బారిన పడుతున్నట్టు అనేక అధ్యయాలు వెల్లడిస్తున్నాయి. ఒక్కసారి స్థూలం కాయం బారిన పడిన తర్వాత దాన్ని తగ్గించేందుకు యోగా, వ్యాయామం, వాకింగ్ ఇలా ఎన్నో చేస్తుంటాం. అయితే, అయినప్పటికీ.. శరీరంలో కొవ్వు పెరుగుతుంది. ఇలాంటి కొవ్వును మనకు అందుబాటులో ఉన్న వస్తువులతో మనం తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్ధాం. 
 
1. విటమిన్ 'సి' పుష్కలంగా ఉండే నిమ్మకాయలో కొవ్వును కరిగించే లక్షణాలు ఉన్నాయి. దీనికి మలబద్దకాన్ని తగ్గించి జీర్ణక్రియను పెంచుతుందట. ఐరన్‌లోపంతో బాధపడేవారు తొందరగా నీరసించే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు ఎక్కువ కేలరీలు ఉన్న స్నాక్స్ తీసుకునే బదులు లెమన్ జ్యూస్‌తో కూడిన సలాడ్ తీసుకుంటే ఎక్కువ శక్తిని ఇవ్వడమే కాకుండా శరీరంలోని కొవ్వును కూడా కరిగిస్తుందని వైద్యులు చెపుతున్నారు. 
 
2. వంటింట్లో అందుబాటులో ఉండే లవంగాలు, మిర్చి, దాల్చిన చెక్క వంటివి కూరల్లో ఎక్కువగా వాడటం వల్ల శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయట. ఈ వేడి శరీర జీర్ణక్రియలో కొద్దిపాటి వృద్ధిని కలిగిస్తుంది. దీనివల్ల బాడీలో ఫ్యాట్ తగ్గే అవకాశం ఉందని వారు అంటున్నారు. 
 
3. టమోట, కీరదోస, గుమ్మడిల్లో తక్కువ కేలరీస్ ఉంటాయి. కానీ, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల ఆకలి ఎక్కువగా వేయదు. ఫైబర్ జీర్ణమవ్వడానికి శరీరం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల కొవ్వు సులభంగా కరిగిపోతుంది. వీటితో ఎక్కువ విటమిన్స్, మినరల్స్ శరీరానికి అందించడమే కాకుండా యాంటీఆక్సిడెంట్స్ జీర్ణక్రియను, శక్తిని స్థాయిలో ఉంచుతాయని పేర్కొంటున్నారు. 
 
4. బాదంపప్పు, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, తేనె, మజ్జిగ, వెల్లుల్లితో కూడా శరీరంలోని కొవ్వును కరిగించుకునేందుకు ఎంతగానో దోహదపడతాయని గృహ వైద్యులు చెపుతున్నారు. 

అన్నీ చూడండి

అక్టోబర్ 25, 2026 నాటి తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

Cyclone Threat: అర్నాబ్ తుఫాను.. తెలంగాణ జిల్లాలకు రెడ్ అలెర్ట్

పాకిస్థాన్ వల్లే కాశ్మీరీలు ప్రాణాలతో ఉన్నారు : ఫరూక్ అబ్దుల్లా

మీసంతో పుట్టిన పసికందు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో (video)

పంజాబ్‌లో కారు బీభత్సం : టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

అన్నీ చూడండి

బలహీన పురుషుడి సంతోషం కోసం మహిళను అణిచివేస్తారా? ఉపాసన ప్రశ్న

Fauzi File Number 25: సోల్జర్‌ ఫౌజీ గా సరికొత్త శకం క్రియేట్ చేసిన రెబల్ ప్రభాస్ ఎలా?

Singha Update: ఆకట్టుకునే గోపీచంద్ జంగిల్ పోస్టర్లతో సింగా చిత్రం సగభాగం పూర్తి

Vijay Deverakondaఫ రణబాలి నా జీవితానికి అర్థాన్నిచ్చింది, రాయలసీమ రుణం తీర్చుకున్నా -విజయ్ దేవరకొండ

Trivikram: నాకు, వెంకటేష్ కి కూడా AK47 కథ ఫస్ట్ అటెంప్ట్.: త్రివిక్రమ్ శ్రీనివాస్

తర్వాతి కథనం
Show comments