శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By
Last Updated : సోమవారం, 15 అక్టోబరు 2018 (18:34 IST)

చిన్నారులకు గోరువెచ్చని గోరుముద్దలే పెట్టాలి.. ఎందుకో తెలుసా?

చిన్నారులకు ప్లాస్టిక్ వస్తువుల్లో అన్నం తినిపించకండి అంటున్నారు.. చైల్డ్ కేర్ నిపుణులు. అలాగే పిల్లలకు అన్నం పెట్టే వస్తువులు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.

చిన్నారులకు ప్లాస్టిక్ వస్తువుల్లో అన్నం తినిపించకండి అంటున్నారు.. చైల్డ్ కేర్ నిపుణులు. అలాగే పిల్లలకు అన్నం పెట్టే వస్తువులు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. పిల్లలకు సరైన వేళల్లో ఆహారం ఇస్తూ వుండాలి. పిల్లలకు పాఠశాలలకు తీసుకెళ్లే లంచ్ బాక్సులు కూడా ప్లాస్టిక్‌వి కాకుండా వుంటే మంచిది.
 
మైక్రోవేవ్‌లో ఆహారం వేడిచేస్తే మొదట కొద్దిగా మీరు రుచి చూసిన తర్వాతే పిల్లలకు పెట్టాలి. పిల్లలు టేబుల్‌పై తినేటప్పుడు వేడి పదార్ధాలు టేబుల్‌పై ఉంచకుండా చూసుకోవాలి. పిల్లలకు తిండి పెట్టే వస్తువులను వేడి నీళ్లతో కడిగితే మంచిది. 
 
వేడి పదార్థాలు వడ్డించేటప్పుడు అవి పసిపిల్లలు తినగలగలిగిన ఉష్ణోగ్రతలోనే ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఎప్పుడూ గోరువెచ్చని ఆహారాన్ని ఇవ్వడం ద్వారా సులభంగా జీర్ణమవుతుందని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నాపు.