శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : శనివారం, 13 అక్టోబరు 2018 (13:06 IST)

అరటి పండుతో జీర్ణవ్యవస్థ మెరుగు.. మరి అందానికి ఎలా..?

ఈ కాలంలో ఎక్కువగా చర్మం పొడిబారుతుంటుంది. దాంతో ముఖం ముడతలు తాజాదనాన్ని కోల్పోతుంది. మీగడ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలోని విటమిన్స్ చర్మం సౌందర్యానికి సహజసిద్ధంగా పనిచేస్తాయి. మీగడలో కొద్దిగా చక్కెర కలిపి ప్రతిరోజూ సేవిస్తే ముఖం ముడతలు తొలగిపోయి తాజాగా మారుతుంది.
 
అలానే మజ్జిగలో కొద్దిగా ఆలివ్ నూనె, అల్లం మిశ్రమం కలుపుకుని ముఖానికి, మెదడు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేయడం వలన చర్మం మృదువుగా మారుతుంది. 
 
అరటి పండులోని ఫైబర్ జీర్ణవ్యవస్థ మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ అరటిపండు రాత్రివేళలో సేవిస్తే అనారోగ్య సమస్య అంటూ ఏది ఉండదు. మరి దీనితో అందాని ఏర్పడే లాభాలు తెలుసుకుందాం.. అరటి పండు గుజ్జులో కొద్దిగా పాలు, నిమ్మరసం, రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా చేసుకుని ప్యాక్‌లా వేసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే మృదువైన చర్మం మీ సొంతమవుతంది.