శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 12 అక్టోబరు 2018 (20:10 IST)

అందంగా వుండేందుకు కాస్మోటిక్స్ ఎందుకు? ఇవి పాటిస్తే చాలు...

ఆరోగ్యమైన మరియు అందమైన చర్మాన్ని పొందడానికి మహిళలు అనేక రకములైన లోషన్స్, క్రీంలు... ఇంకా కృత్రిమ రసాయనాల వైపు మొగ్గు చూపడం అంత శ్రేయస్కరం కాదని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. సౌందర్యాన్ని ఇష్టపడేవాళ్లు బ్యూటీపార్లర్లకు అధిక సమయాన్ని కేటాయిస్తుంటారు. ఇలాంటి కాస్మోటిక్స్ వాడటం వలన సున్నితంగా ఉండే చర్మం పాడైపోతుంది. అలా కాకుండా మనం గృహ చిట్కాలను పాటించడం వలన అందమైన మరియు ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు. అదెలాగో చూద్దాం.
 
1. నిమ్మకాయ సౌందర్య ప్రయోజనాలు అందరికీ విస్తృతంగా తెలిసినదే. ఇందులో విటమిన్-సి విరివిగా ఉంటుంది. ఈ విటమిన్ సి చర్మాన్ని లోతుగా శుద్ధి చేయడంలో చర్మ రంధ్రాలలోని మృత కణాలను తొలగించి, చర్మరంధ్రాలను తెరవడంలో సహాయపడుతుంది. 
 
2. చర్మాన్ని ఆరోగ్యకర కణాలతో నింపడంలో ప్రయోజనకారిగా ఉంటుంది. నిమ్మకాయలో ఉండే ఆల్ఫా-హైడ్రాక్సీ ఆమ్లాలు, పిగ్మేంటేషన్ మరియు ఇతర నల్లటి మచ్చలను సమర్థవంతంగా తొలగించడంలో సహాయపడుతుంది. 
 
3. అరస్పూను తాజా నిమ్మరసంలో ఒక టేబుల్ స్పూన్ ఉప్పును కలపాలి. అందులో ఒక స్పూను నీళ్లు జోడించి అన్ని పదార్ధాలను మిశ్రమం అయ్యేలా బాగా కలపాలి. కడిగిన ముఖంపై ఈ మిశ్రమాన్ని 2-3 నిమిషాల పాటు మీ చేతివేళ్ల సహాయంతో వృత్తాకారంలో మర్దించి కొన్ని నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత వెచ్చని నీటితో శుభ్రం చేయడం ద్వారా, మూసుకుపోయిన చర్మ రంధ్రాలను తెరవడంలో సహాయపడుతుంది.
 
4. ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, మరియు కొన్ని చుక్కల రోజ్ వాటర్ వేసి మిశ్రమంగా కలపాలి. ఈ ద్రావణంలో ఒక కాటన్ బాల్ ముంచి, ముఖం మీద సున్నితంగా రుద్దండి. అయిదు నిముషాల పాటు అలాగే వదిలేసి, చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
 
5. ఒక స్పూన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ పచ్చి పాలు వేసి కలపాలి. అందులో ఒక కాటన్ బాల్ ముంచి, ముఖం మీద అప్లై చేయాలి. 10 నిమిషాలు ఆరనిచ్చాక, చల్లటి నీటితో శుభ్రపరచాలి.