శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By ivr
Last Modified: గురువారం, 23 ఫిబ్రవరి 2017 (21:29 IST)

జననేంద్రియాలకు చెడు చేసే ఆకు కూర... ఏంటది?

ఇది అందరికీ తెలుసిందే, అందరికీ అందుబాటులో దొరికే ఆకుకూర. చాలా తేలిగ్గా జీర్ణమై శరీరానికి ఆరోగ్యాన్నిస్తుంది. నోటికి పుల్లగా వుండి మంచి రుచిని కలిగిస్తుంది. దీన్ని పప్పు కలిపి వండుకోవచ్చు. పులుసుగాను, పచ్చడిగాను, కూరగాను, ఇంకా అనేక రకాలుగాను ఈ ఆకును ఉ

ఇది అందరికీ తెలుసిందే, అందరికీ అందుబాటులో దొరికే ఆకుకూర. చాలా తేలిగ్గా జీర్ణమై శరీరానికి ఆరోగ్యాన్నిస్తుంది. నోటికి పుల్లగా వుండి మంచి రుచిని కలిగిస్తుంది. దీన్ని పప్పు కలిపి వండుకోవచ్చు. పులుసుగాను, పచ్చడిగాను, కూరగాను, ఇంకా అనేక రకాలుగాను ఈ ఆకును ఉపయోగిస్తారు. ఇతర కూరలతో కలిపి కూడా వండుకోవచ్చు. పైత్య తత్వం గలవారికి పైత్యరోగాలలో ఈ కూర తినడం వల్ల మేలు చేస్తుంది.
 
చుక్క కూర ఆకులు రసం ఒక ఔన్సు తీసి పెరుగులో కాని, పాలతో కాని కలిపి తాగితే మూడు రోజుల్లో కామెర్ల వ్యాధి తగ్గుతుంది. అనేక రకాల చర్మవ్యాధులు తగ్గిస్తుంది. త్వరగా జీర్ణంకాని దుంపకూరలు, పప్పు దినుసులతో ఈ ఆకు కలిపి వండితే త్వరగా జీర్ణం అయ్యేటట్లు చేస్తుంది. ఔన్సు చుక్క కూర ఆకు రసంలో చిటికెడు సోడా ఉప్పు కలిపి తాగితే కడుపునొప్పులు, కీళ్లనొప్పులు తగ్గుతాయి. గ్రహిణి, అతిసార వ్యాధుల్లో చుక్కకూర పథ్యమివ్వడం వల్ల సులభంగా తగ్గుతాయి. 
 
చుక్కకూర మలబద్ధకాన్ని పోగొట్టికాల విరేచనం అయ్యేటట్టు చేస్తుంది. మంచి ఆకలిని పుట్టిస్తుంది. వాంతుల్ని అరికడుతుంది. ఎండుమర్చి, ధనియాలు, వెల్లుల్లి, మినపప్పు, కలిపి వేయించి, చింతపండు, ఉప్పు కలిపి చుక్కకూర ఆకు పచ్చడి చేసుకుంటే నోటికి రుచిగా వుండి పైత్య రోగాలను ముక్కు నుంచి రక్తం పడే వ్యాధిని తగ్గిస్తుంది. ఈ ఆకు ఎక్కువగా వాడితే జననేంద్రియాలకు చెడు చేస్తుంది. విటమిన్ ఎ,బిలతో పాటు ఎక్కువ శాతం సి విటమిన్ సున్నాన్ని అందిస్తుంది చుక్కకూర.