మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: బుధవారం, 1 నవంబరు 2017 (18:59 IST)

అమ్మో... తలకు నూనె ఇలా పెడుతున్నారా...

ఈ రోజుల్లో తలకు నూనె పెట్టే అలవాటు క్రమంగా కనుమరుగై పోతుంది. వేగవంతమైన ఉరుకుల, పరుగుల జీవితం కారణంగా చాలామందికి తలకు నూనె పెట్టుకునే తీరికే ఉండదు. దానికితోడు తలకు నూనె పెట్టడం వల్ల ముఖం జిడ్డుగా మారి అందవిహీనంగా కనిపిస్తామంటూ మరికొందరు కొబ్బరినూనె పె

ఈ రోజుల్లో తలకు నూనె పెట్టే అలవాటు క్రమంగా కనుమరుగై పోతుంది. వేగవంతమైన ఉరుకుల, పరుగుల జీవితం కారణంగా చాలామందికి తలకు నూనె పెట్టుకునే తీరికే ఉండదు. దానికితోడు తలకు నూనె పెట్టడం వల్ల ముఖం జిడ్డుగా మారి అందవిహీనంగా కనిపిస్తామంటూ మరికొందరు కొబ్బరినూనె పెట్టరు. కానీ దాని విలువ తెలిస్తే మాత్రం వారి ఆలోచనలో మార్పు రావడం ఖాయమని నిపుణులు అంటున్నారు.
 
తలకు క్రమంగా నూనె పట్టించి మర్దనా చేయిస్తే కాలక్రమంలో వాటి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. తల వెంట్రుకలు తెల్ల పడకుండా ఉండటంలో కొబ్బరి నూనె పాత్ర మరిచిపోలేనిది. అంతేకాదు తలకు సంక్రమించే చుండ్రు, ఫంగల్ సమస్యల నుంచి కూడా కొబ్బరి నూనె కాపాడుతుంది. తలకు నూనె రాస్తే చిన్నప్పుడే తెల్ల వెంట్రుకలు రాకుండా నిరోధించవచ్చు. పెద్దవారు మామూలుగా తలకు నూనె పెట్టమని చెబుతూ ఉంటారు. నూనె పెడితే కాలుష్య నిరోధినిగా కూడా మన తలకు ఉపయోగపడుతుంది. అతినీలలోహిత కిరణాలు మనపై పడకుండా కాపాడుతుంది. 
 
జుట్టు పొడిబారుతుంటే ఇలా చేయాలి. తలకు నూనెను పట్టించి వేడి నీటిలో ముంచిన టవల్‌ను చుట్టి నీటిని పిండిన తరువాత దాన్ని తలకు చుట్టుకోవాలి. కొద్దిసేపటి తరువాత నూనె మీ పొడిబారిన జుట్టులోకి వెళ్ళి పరిస్థితిలో మార్పు వస్తుంది. మెరుగైన రక్తప్రసరణ జరుగుతుంది.