బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : శనివారం, 14 అక్టోబరు 2017 (10:41 IST)

జుట్టు చిక్కుపడితే ఇలా చేయండి..

బొప్పాయి పండు గుజ్జులో ఒక చెంచా ఓట్స్‌, ఒక చెంచా తేనె, రెండు చెంచాల పచ్చి పాలను కలుపుకొని స్క్రబ్‌లా చేయాలి. దీంతో ఐదు నిమిషాల పాటు ముఖాన్ని మర్దన చేయాలి. ఐదు నిమిషాల తర్వాత కడిగితే సరిపోతుంది. ఇలా క్

బొప్పాయి పండు గుజ్జులో ఒక చెంచా ఓట్స్‌, ఒక చెంచా తేనె, రెండు చెంచాల పచ్చి పాలను కలుపుకొని స్క్రబ్‌లా చేయాలి. దీంతో ఐదు నిమిషాల పాటు ముఖాన్ని మర్దన చేయాలి. ఐదు నిమిషాల తర్వాత కడిగితే సరిపోతుంది. ఇలా క్రమం తప్పకుండా చేస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది. 
 
జుట్టు చిక్కుపడితే.. నిమ్మకాయ ముక్కలను నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటితో తల స్నానం చేస్తే చాలు… చిక్కులు, చుండ్రు సమస్య తొలగిపోతాయి. రెండు కప్పుల గులాబీ నీటిలో రెండు చెంచాల బ్లాక్‌ టీ పౌడర్‌, ఒక షాంపూ వేసి బాగా కలిపి కురులకు పట్టించి 15 నిమిషాల తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది. ఇలా వారానికి రెండు సార్లు చేసిన జుట్టు ఊడటం తగ్గుతుంది.
 
ఒక కప్పు పెరుగులో సగం చెంచా చక్కెర కలిపి మెత్తగా పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమంలో నారింజ పొడిని కలుపుకొని ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగితే సరిపోతుంది.