మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శనివారం, 19 జులై 2014 (18:23 IST)

వేడి వేడి అన్నంలో చల్ల చల్లని పెరుగు వేసుకోవచ్చా?

వేడి వేడి అన్నంలో చల్లని పెరుగు వేసుకోవచ్చా? ఈ డోట్ క్లియర్ కావాలంటే ఈ స్టోరీ చదవండి. వేడి వేడి రైస్‌లో చల్లని పెరుగు వేసుకుని తినడం ద్వారా అజీర్ణ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా వేడి అన్నంలో చల్లని పదార్థాలను వేసుకుని తినడం మంచిది కాదు. ఇలా చేస్తే అజీర్తి, ఉదర సంబంధిత రోగాలు తప్పవు.
 
అందుచేత ఆహారాన్ని ఆరనించి తర్వాతే పెరుగు వేసుకుని తినాలి. అలాగే మధ్యాహ్నానికి తినేందుకైనా.. వేడి వేడి రైస్‌లో పెరుగును కలిపి టిఫిన్ బాక్సుల్లో నింపేయడం కూడా జీర్ణ వ్యాధులకు దారితీస్తుంది. 
 
ఒక వేళ వేడి వేడి అన్నంలో పెరుగును కలపాల్సి వస్తే.. అరగ్లాసు ఆరిన పాలను చేర్చి.. అందులో కాసింత పెరుగును చేర్చుకుంటే సరిపోతుంది. ఇది మధ్యాహ్నానికల్లా పెరుగుగా మారుతుందని తద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు . పెరుగే కాదు.. మజ్జిగను కూడా వేడి వేడి అన్నంలో కలుపుకుని తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.