గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 12 మే 2017 (19:53 IST)

గ్రీన్ టీ ఆకులతో అందం... స్త్రీలకే కాదు పురుషులకు కూడా...

గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పరిశోధనలు నిరూపించాయి. ఆరోగ్యానికే కాదు అందానికి కూడా గ్రీన్ టీ ఆకులు ఉపయోగపడతాయి. కళ్లు అలసటగా వున్నప్పుడు ఫ్రిజ్ నుంచి తీసిన గ్రీన్ టీ బ్యాగులను 15 నిమిషాల పాటు కళ్లపై ఉంచుకోవాలి. అలా చేస్తే ఆ అలసట తగ్గిపో

గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పరిశోధనలు నిరూపించాయి. ఆరోగ్యానికే కాదు అందానికి కూడా గ్రీన్ టీ ఆకులు ఉపయోగపడతాయి. కళ్లు అలసటగా వున్నప్పుడు ఫ్రిజ్ నుంచి తీసిన గ్రీన్ టీ బ్యాగులను 15 నిమిషాల పాటు కళ్లపై ఉంచుకోవాలి. అలా చేస్తే ఆ అలసట తగ్గిపోతుంది. అంతేకాదు... గ్రీన్ టీలో వుండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి అందటం ద్వారా కళ్ల కింద నల్లటి మచ్చలు తగ్గిపోతాయి.
 
గ్రీన్ టీ ఆకులను పొడిలా చేసి అందులో కాసిన నీళ్లు పోసి మిశ్రమంలా చేసుకోవాలి. దీన్ని చర్మం పైన ఎండ ఎక్కడ తగులుతుందో అక్కడ రాసుకోవాలి. ఆ తర్వాత పావుగంటకు దాన్ని కడిగేస్తే చర్మంపై వున్న మురికి వదిలిపోతుంది. ఫేషియల్ చేయించుకునేవారు ఆవిరి పడుతుంటారు... అలా చేసేటపుడు కొన్ని గ్రీన్ టీ ఆకులు వేస్తే మంచి ఫలితం వుంటుంది. చర్మ నిగనిగలాడుతుంది.