గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 17 ఏప్రియల్ 2023 (23:58 IST)

మెంతి కూర ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

మెంతి కూర. ఇది ఆకలి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మెంతులు రుచికి చేదుగా వున్నప్పటికీ వీటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. రక్తపోటును అదుపులో వుంచుంది. తల్లి పాలు స్రావం చేయడంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జుట్టు రాలడం, పరిపక్వ జుట్టు, యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్త స్థాయిలను మెరుగుపరుస్తుంది.

 
నాడీ వ్యవస్థ, పక్షవాతం, మలబద్ధకం, పొత్తికడుపు నొప్పి తదితర వ్యాధుల చికిత్సలో ప్రభావవంతంగా ఉంటుంది. దగ్గు, ఉబ్బసం, బ్రాంకైటిస్, ఛాతీ బిగుతు, ఊబకాయం వంటి వ్యాధుల నుండి ఉపశమనంలో సాయపడుతుంది. అధిక రుతుక్రమం మొదలైన రక్తస్రావం రుగ్మతలలో మెంతులు ఉపయోగించకూడదు. 
 
టీస్పూన్ మెంతి పొడిని రోజుకు రెండుసార్లు భోజనానికి ముందు లేదా రాత్రి వేడి పాలు లేదా నీటితో కలిపి తినవచ్చు.విత్తనాలను పేస్టులా చేసి పెరుగుతో కలిపి మిశ్రమాన్నితలకు పట్టిస్తే చుండ్రు, జుట్టు రాలడం తగ్గుతాయి.