శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (21:37 IST)

ప్రతి రోజూ ఉదయం ఐదు నుంచి ఆరు తులసి ఆకులు నమిలితే...

రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి చీటికి మాటికీ ఎలర్జీ బారిన పడుతుంటారు. దీంతో వారికి తుమ్ములు, జలుబు వస్తుంటాయి. ఇటువంటి ఇబ్బంది ఉన్నవారు ప్రతిరోజు పరగడుపున ఉసిరి పొడి, రసం తీసుకుంటే ఫలితం ఉంటుందని గృహ వైద్యులు చెపుతున్నారు. 
 
ప్రతి రోజూ ఉదయం ఐదు నుంచి ఆరు తులసి ఆకులు నమిలి మింగటం కూడా మంచిదేనని వారు చెపుతున్నారు. అలాగే, ఒక స్పూన్ సొంఠి పొడి లేదా ఒక స్పూన్ అల్లం రసం తాగినా జలుబు, తుమ్ములు మటుమాయం అవుతాయని చెపుతున్నారు. 
 
అర గ్లాసు నీళ్ళలో ఐదు తులసి ఆకులు, ఐదు లవంగాలు వేసి మరిగించి, ఆ పైన చల్లార్చి తాగాలి. అర గ్లాసు నీరు, అరగ్లాసు పాలు కలిపి అందులో రెండు ఎండు ఖర్జూర పళ్ళు వేసి మరిగించి అవి సగం అయ్యే వరకు వేడి చేసి ఆ పైన చల్లార్చి రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇదే పద్దతిలో దాల్చిన చెక్క వేసి మరిగించి, చల్లార్చి తాగాలి.