మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Modified: శుక్రవారం, 26 జులై 2019 (17:21 IST)

వెల్లుల్లి రెబ్బను నోట్లో వేసుకుని నమిలితే...?

రోజూ ఒకటి రెండు వెల్లుల్లిపాయలను నోట్లో వేసుకుని నమలండి. లేదా ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం మరిచిపోకండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. వెల్లుల్లి గొప్ప ఔషధ గుణాలున్నాయి. 
 
వెల్లుల్లి గొప్ప డిటాక్సిఫైఫుడ్. ఎందుకంటే వెల్లుల్లిలో యాంటీవైరస్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ బయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే కెమికల్ ఉండటం వల్ల వైట్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇంకా టాక్సిన్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది. కాబట్టి, ప్రతి రోజూ ఒకటి రెండి వెల్లుల్లిపాయలను నోట్లో వేసుకొని నమలడం లేదా ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
అలాగే రెగ్యులర్ డైట్‌లో గ్రీన్ టీ చేర్చుకోవడం ద్వారా అలసటను దూరం చేసుకోవచ్చు. శరీరంలో టాక్సిన్స్ నివారించడానికి ఇది చాలా గొప్పగా సహాయపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్‌ను ఫుష్కలంగా ఉండి వివిధ రకాల జబ్బుల నుండి కాలేయాన్ని కాపాడుతుంది.
 
అలాగే తాజా పండ్లు, కూరగాయల్లో విటమిన్స్, మినిరల్స్, యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్, లో క్యాలరీలు ఫుష్కలంగా ఉండటం వల్ల వీటిని రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం చాలా అత్యవసరమని న్యూట్రీషన్లు చెప్పారు.