గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 24 జులై 2019 (20:11 IST)

యాపిల్ తింటే బ్యాక్టీరియాను ఆరగించినట్టేనా?

సాధారణంగా రోజుక ఒక యాపిల్ ఆరగించినట్టయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని వైద్యులు చెబుతుంటారు. ఈ పండ్లను తినడం వల్ల పేగులను శుభ్రం చేయడమేకాకుండా, ఆరోగ్యంగా ఉంచే బ్యాక్టీరియాను అధికమొత్తంలో ఉత్పత్తి చేస్తుందన్నది వైద్యుల వాదన. అయితే, యాపిల్ ఆరగించడం వల్ల రోజూ వందల మిలియన్ల బ్యాక్టీరియా ఆరగించినట్టేనని తాజాగా పరిశోధకులు అంటున్నారు. 
 
ఇదే అంశంపై ఇటీవల అమెరికాకు చెందిన వైద్యులు పరిశోధనలు చేపట్టారు. ఇందులో 'ఈ బ్యాక్టీరియా, ఫంగీ, వైరస్‌లు శరీర సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. 240 గ్రాములు ఉన్న ఒక్కో యాపిల్‌లో సుమారు 100 మిలియన్ బ్యాక్టీరియా ఉండొచ్చు. మామూలు యాపిల్‌ల కంటే ఆర్గానిక్ ఉత్పత్తుల్లోనే బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటున్నాయి' అని తెలిపారు.
 
పండ్లు తాజాగా ఉండాలని చేసే కృత్రిమ సాధనాల వల్ల కూడా ఇలా జరగొచ్చని వివరించారు. నిజానికి యాపిల్‌కు ఫంగల్ వ్యాప్తి చెందే గుణం ఎక్కువగా ఉందని, పలు రకాల యాపిల్ ఉత్పత్తుల్లో ఈ విషయం స్పష్టమైనట్లు పరిశోధకులు వెల్లడించారు.