శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : గురువారం, 25 జులై 2019 (14:31 IST)

మలబద్దక సమస్య ఎందుకు వస్తుందో తెలుసా?

చాలా మంది మలబద్దక సమస్యతో బాధపడుతుంటారు. దీనికి అనేక కారణాలు లేకపోలేదు. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యతో బాధపడేవారిలోనూ, స్థూలకాయం, జీర్ణ వ్యవస్థ పనితీరులో మందగమనం, ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. 
 
వీటితో పాటు.. వివిధ రకాల రోగాల నయం చేసుకునేందుకు తీసుకునే మందుల వల్ల కూడా ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. గంటల తరబడి బాత్రూమ్‌లో కూర్చొన్నప్పటికీ మలవిసర్జన సాఫీగా సాగదు. దీన్నే మలబద్దక సమస్య అంటారు. అయితే, ఈ సమస్య పరిష్కారం కోసం కొన్ని చిన్నపాటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఇపుడు తెలుసుకుందాం. 
 
* ప్రతి రోజూ పరగడుపునే ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్‌ను తీసుకున్నట్టయితే సమస్య నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. విరేచనం సాఫీగా సాగుతుంది. 
* ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో రెండు స్పూన్ల నెయ్యి వేసి బాగా కలిపి తాగితే చాలు వెంటనే విరేచనం అవుతుంది. 
* ప్రతి రోజూ నెయ్యి లేదా కొబ్బరి నూనెను తీసుకోవడం వల్ల మలబద్దక సమస్య ఎన్నటికీ రాదు. 
*ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక నిమ్మకాయను పూర్తిగా పిండి ఆ నీటిని తాగితే విరేచనం సాఫీగా అవుతుంది. 
* ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను కలుపుకుని తాగినా ఫలితం ఉంటుంది. 
* ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా ఎప్సం సాల్ట్‌ను కలుపుకుని తాగినా మలబద్దకం నుంచి తప్పించుకోవచ్చు.