క్యాన్సర్‌, కొలెస్ట్రాల్‌లను తగ్గించే "ఇరానీ దమ్ టీ"

మనీల| Last Modified శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (12:35 IST)
టీ డస్ట్... 8 టీ.
టీ ఆకులు... 8 టీ.
బిస్కెట్ పౌడర్.. ఒక టీ.
మంచినీరు... 4 కప్పులు
పాలు.. ముప్పావు లీ.
పంచదార.. 150 గ్రా.

తయారీ విధానం :
టీ డస్ట్‌, టీ ఆకు, బిస్కెట్‌ పౌడర్‌లను ఒక్కటిగా చేసి మిశ్రమంలా కలపాలి. పాలల్లో పంచదార వేసి స్టవ్‌ మీద ఉంచి సన్నని మంట మీద ఎర్రగా కాయాలి. మరోవైపు మూత ఉన్న పొడవైన రాగి పాత్రను తీసుకుని అందులో నీళ్లు పోయాలి. తరువాత పల్చటి వస్త్రంలో టీపొడి మిశ్రమాన్ని వేసి, ఆ వస్త్రాన్ని పాత్రకు చుట్టాలి.

ఈ వస్త్రం నీళ్లలోకి పూర్తిగా జారకుండా, కాస్త పాత్రలో ఉండేలా చూసి మూత బిగించాలి. ఈ రాగి పాత్రను స్టవ్‌మీద ఉంచాలి. నీళ్లు మరిగేటప్పుడు ఆ ఆవిరికి టీపొడిలోని సారం చుక్కలు చుక్కలుగా నీళ్లలోకి జారుతుంది. ఇలా అరగంటసేపటికి టీ డికాక్షన్‌ సిద్ధమవుతుంది. ఇప్పుడు ఈ డికాక్షన్‌ను కప్పుల్లో పోసి, ఆ పైన కాచిన పాలు కలిపితే హైదరాబాదీ స్పెషల్‌ ఇరానీ దమ్‌ టీ సిద్ధం..!

తేయాకులో పుష్కలంగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు అనేక వ్యాధుల నివారణకు చక్కగా ఉపయోగపడతాయి. ఇందులోని పాలీ ఫినాల్స్‌, కేటెచిన్స్‌ మూత్రకోశ వ్యాధుల్నీ క్యాన్సర్‌నీ కొలెస్ట్రాల్‌నీ తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అధిక రక్తపోటును,ఒత్తిడినీ తగ్గిస్తాయి. బ్లాక్‌టీకన్నా గ్రీన్‌టీలో కేటెచిన్స్‌ ఎక్కువ శాతంలో లభ్యమవుతాయి.దీనిపై మరింత చదవండి :