బిర్యానీలు, మసాలా దట్టించిన వంటకాలు తింటే అంతే సంగతులు..?!
పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌లో వైఫల్యం కారణంగా మికీ ఆర్థర్‌ను కోచ్ బాధ్యతల నుంచి తప్పించిన పాక్ క్రికెట్ బోర్డు మాజీ ఆటగాడు మిస్బాను కొత్త కోచ్‌గా ప్రకటించింది.
పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన మాజీ ఆటగాడు మిస్బావుల్ హక్.. క్రికెటర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాడు. అందుకే పాక్ ఆటగాళ్లు ఇకపై బిర్యానీలు, మసాలా దట్టించిన వంటకాలు, మిఠాయిలు, పిజ్జా, బర్గర్లు తినడం కుదరంటూ స్పష్టం చేశాడు. క్రికెటర్లు 100 శాతం ఫిట్ నెస్ సాధించాలంటే ఇలాంటి కఠినచర్యలు తప్పవని మిస్బా అభిప్రాయపడుతున్నాడు.
మ్యాచ్‌లు వున్నా లేకున్నా.. ఒకటే డైట్ పాటించాల్సి వుంటుందని మిస్పా పాకిస్థాన్ క్రికెటర్లను ఆదేశించాడు. ఈ కొత్త డైట్ ప్లాన్ పాకిస్థాన్ జట్టు ఆటగాళ్లకే కాకుండా జాతీయస్థాయి క్రికెటర్లందరికీ వర్తిస్తుందని స్పష్టం చేశాడు.