గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శనివారం, 23 సెప్టెంబరు 2017 (21:22 IST)

శృంగారానికి ముందు అవి తీసుకుంటే...?

ఉదయం చేసే జాగింగ్ కంటే ఎన్నో రెట్లు శృంగారం ఉత్తమం అంటున్నారు వైద్య నిపుణులు. అంతేకాదు.. అలసిపోయి ఇంటికొచ్చిన వెంటనే నచ్చిన స్వీట్స్ తీసుకోవడం ద్వారా స్టామినా పెంచుకోవచ్చని అంటున్నారు. ఇలా చేయడం ద్వారా కోల్పోయిన శక్తిని తిరిగి పొందవచ్చని చెపుతున్నారు

ఉదయం చేసే జాగింగ్ కంటే ఎన్నో రెట్లు శృంగారం ఉత్తమం అంటున్నారు వైద్య నిపుణులు. అంతేకాదు.. అలసిపోయి ఇంటికొచ్చిన వెంటనే నచ్చిన స్వీట్స్ తీసుకోవడం ద్వారా స్టామినా పెంచుకోవచ్చని అంటున్నారు. ఇలా చేయడం ద్వారా కోల్పోయిన శక్తిని తిరిగి పొందవచ్చని చెపుతున్నారు. శృంగారానికి ముందు పచ్చికూరలు, చేదుగా, వగరుగా ఉండే కూరగాయలు తినడం కంటే, కొన్ని ఆరోగ్యకరమైన తీపి పదార్థాలను తీసుకోవడం మంచిదంటున్నారు. స్వీట్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా రాత్రుల్లో భాగస్వామితో ఉత్సాహంగా వుంటారని తమ అధ్యయనంలో తేలిందంటున్నారు.
 
సలాడ్స్‌లో టమోటో ముక్కలను జోడించి డిన్నర్‌కు ముందు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. శృంగారానికి ముందు ఒక గ్లాస్ బాదం మిల్క్ త్రాగడం వల్ల మంచి ఎనర్జీని పొందవచ్చు. అత్తిపండు తినడం వల్ల దానిలో వుండే అమినో యాసిడ్స్ కారణంగా శృంగార సామర్థ్యం మెరుగవుతుంది. శృంగారంలో పాల్గొనడానికి ముందు చాక్లెట్ తినడం వల్ల కూడా మంచి ఫలితం వుంటుంది.