మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 8 మే 2020 (22:02 IST)

వేసవిలో సబ్జా గింజల నీటిని తాగితే ఏమవుతుంది?

వేసవి రాగానే చాలామంది సబ్జా గింజలను నీళ్లలో వేసుకుని తాగుతుంటారు. ఒక గ్లాసు నీళ్లలో నానబెట్టుకొని ఆ నీటిని తాగితే జీవక్రియలు చురుగ్గా సాగుతాయట. మహిళలకు తప్పకుండా కావాల్సిన ఫోలేట్‌తో పాటు అందాన్ని ఇనుమడింపచేసే విటమిన్ 'ఇ' కూడా ఇందులో లభిస్తుంది.. మరి ఇంకా ఎలాంటి ఖనిజాలు వీటిలో దాగున్నాయో చూద్దాం.
 
1. సబ్జా గింజల్లో ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్లు సాల్మన్ చేపల్లో కంటే ఎక్కువగా లభిస్తాయి. ఈ ఒమెగా-3 ఆమ్లాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్, హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.
 
2. బ్యాక్టీరియా సంబంధిత సమస్యలని నివారించే మంచి యాంటీబయోటిక్‌లా కూడా పనిచేస్తాయి ఈ గింజలు.
 
3. కేవలం నీటితోనే కాక మజ్జిగ, కొబ్బరినీళ్లతో పాటు ఇతర పండ్ల రసాలతో కూడా ఈ గింజల్ని కలిపి తీసుకోవచ్చు.
 
4. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఈ గింజలను ఒక గ్లాసు నీటిలో వేసుకుని తాగితే మంచి ఫలితముంటుంది.
 
5. ఇవి చర్మ సమస్యల్ని అరికట్టడంలోనూ బాగా సహకరిస్తాయి.
 
6. ఈ విత్తనాలకు కాస్త తడి తగిలినా అవి ఉబ్బిపోతాయి. దీంతో వాటి బరువు పదింతలు పెరిగిపోతుంది.. అందుకే వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే త్వరగా కడుపునిండిన భావన కలిగి మాటిమాటికీ ఆకలేయదు.
 
7. జిగురులా ఉండే ఈ సబ్జ గింజల్లో ఔషధగుణాలు బోలెడు ఉంటాయి, పైగా శరీర ఉష్ణోగ్రతను సైతం తగ్గించి మల, మూత్ర సమస్యల్ని నివారిస్తాయి.
 
8. కేవలం శరీరం లోపలి భాగాన్నే కాక బయట భాగాన్ని కూడా కాపాడటంలో ఇవి బాగా పనిచేస్తాయి. ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ గింజల్ని బాగా నూరి నూనెతో కలిపి గాయాలు, పుండ్లపై రాసుకోవచ్చు, దీని వల్ల అవి త్వరగా తగ్గుతాయి.
 
10. తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఈ గింజల్ని నీళ్లలో కలుపుకొని అవి ఉబ్బిన తర్వాత తాగి చూడండి, సమస్య తగ్గిపోవడమే కాదు.. మానసికంగా ప్రశాంతత కూడా మీ సొంతమవుతుంది.
 
11. రక్తాన్ని శుద్ధి చేయడంలో, శరీరంలోని మలినాలను తొలగించడంలోనూ దీని తరువాతే ఏదైనా..!
 
12. శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కొన్ని గోరువెచ్చని నీటిలో అల్లం రసం, తేనె, నానబెట్టిన సబ్జ గింజలు, ఈ మూడు వేసి కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడంతో పాటు శ్వాస కూడా బాగా ఆడుతుంది.
 
13. గొంతులో మంట, ఆస్తమా, తీవ్రమైన జ్వరం, తలనొప్పి.. లాంటి సమస్యలు పీడిస్తున్నాయా..? ఇలాంటప్పుడు ఈ గింజల్ని నీళ్లలో నానబెట్టి నేరుగా తినేయండి. ఎలాంటి చిరాకునైనా ఇట్టే తగ్గిస్తాయి.
 
14. బీపీ మాటిమాటికీ పెరుగుతోందా..? అయితే వీటిని కచ్చితంగా తీసుకోవాల్సిందే.. వీటిని రోజూ తీసుకోవడం వల్ల బీపీ నెమ్మదిగా అదుపులోకి వస్తుంది.