వేసవిలో రోజూ 3 లీటర్ల నీరు తాగండి.. మజ్జిగ, కొబ్బరినీళ్లు తప్పనిసరి..
వేసవి వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయి. ఎండ వేడిమి తీవ్రత నుంచి శరీరాన్ని కాపాడుకోవాలంటే.. రోజూ 3 లీటర్ల నీరు తాగాలి. స్నాక్స్‌ను పక్కనబెట్టి.. మజ్జిగ, కొబ్బరి నీరు సేవిస్తుండాలి. పండ్లు, తాజా పండ్ల
వేసవి వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయి. ఎండ వేడిమి తీవ్రత నుంచి శరీరాన్ని కాపాడుకోవాలంటే.. రోజూ 3 లీటర్ల నీరు తాగాలి. స్నాక్స్‌ను పక్కనబెట్టి.. మజ్జిగ, కొబ్బరి నీరు సేవిస్తుండాలి. పండ్లు, తాజా పండ్ల రసాలు తీసుకుంటూ వుండాలి. శరీర ఉష్ణాన్ని తగ్గించుకునేందుకు వారానికి రెండు సార్లు ఆయిల్ బాత్ చేయాలి. జుట్టుకు మెంతులు, పేరుగు పేస్టును పట్టించాలి. సమ్మర్‌కు తగ్గట్టు హెయిర్ కట్ చేసుకోవాలి.
ఇక వేసవిలో పెదవుల పగుళ్లకు నిద్రించేందుకు ముందు పాల మీగడను పెదవులపై రాస్తే సరిపోతుంది. చర్మ సమస్యల నివారణకు కలబంద పేస్టును ఉపయోగించాలి. నిద్రించేందుకు ముందు వాస్లిన్ లేదా కొబ్బరి పాలును ముఖాని రాసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేస్తే.. చర్మ సమస్యలుండవు. వేసవి కాలంలో బయటికి వెళ్లాల్సి వస్తే.. బండిలో వెళ్తే తలకు హెల్మెట్ వేయడం, గొడుగు పట్టుకెళ్లడం చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.