వేప పొడిలో ఉన్న అద్భుత ప్రయోజనాలు తెలిస్తేనా...?
వేపను భారతీయులు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వేపలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేపలోని ఔషధ గుణాలు అనారోగ్య సమస్యలను తేలిగ్గా పరిష్కరిస్తుంది. వేపలో యాంటీ బాక్టీరియల్, యాంటి సెప్టిక్ గుణాలుంటాయి. అలాగే వేప... చర్మానికి, జుట్టు, ఆరోగ్యానికి కూడా అద్భు
వేపను భారతీయులు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వేపలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేపలోని ఔషధ గుణాలు అనారోగ్య సమస్యలను తేలిగ్గా పరిష్కరిస్తుంది. వేపలో యాంటీ బాక్టీరియల్, యాంటి సెప్టిక్ గుణాలుంటాయి. అలాగే వేప... చర్మానికి, జుట్టు, ఆరోగ్యానికి కూడా అద్భుత ఫలితాలను అందిస్తాయి. వేప టీ లేదా ఆహారంలో లేదా మందుగా ఉపయోగిస్తే రకరకాల ప్రయోజనాలను పొందవచ్చు. అన్నింటికన్నా వేపపొడిలో ఎన్నో ఉపయోగాలున్నాయి.
వేప పొడిని పళ్ళు తోముడానికి ఉపయోగించవచ్చు. ఇలా చేస్తే చిగుళ్ళను, పళ్ళను హెల్తీగా ఉంచుతుంది. నోట్లో బాక్టీరియాలను నాశనం చేసి కావిటీల సమస్యను నివారించి మంచి శ్వాసను అందిస్తుంది. ఒకవేళ డయాబెటిస్‌తో బాధపడుతుంటే ఒక టీస్పూన్ వేప పొడిని ఒక గ్లాస్ నీటిలో కలిపి ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ఇలా ప్రతిరోజు తీసుకుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. ఇన్సులిన్‌లా పనిచేస్తుంది. వేప పొడిని ముక్కులో డ్రాప్స్‌లా ఉపయోగిస్తే సైనస్ ప్రాబ్లం తగ్గుతుంది.
ఒక టీస్పూన్ వేప పొడిని ఒక గ్లాస్ నీటిలో కలపాలి. మూడు చుక్కలని రోజుకు రెండుసార్లు వాడితే మంచిది. వేప పొడి రక్తాన్ని శుభ్రం చేస్తుంది. కాళ్ళలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే వేప పొడి వాడిన వెంటనే తగ్గిపోతుంది. వేప పొడిని వేడినీటిలో మిక్స్ చేసి పాదాలకు రాసుకుంటే మెరుగైన ఫలితాలు చూడవచ్చు. ఇంతటి ఉపయోగాన్ని ఇచ్చే వేప పొడిని తయారుచేసుకోవడం ఈజీ. కొన్ని వేపాకులు తీసుకుని ఎండబెట్టాలి. రెండు రోజులు ఎండిన తరువాత మరో మూడురోజులు ఇంటిలో నీడలో ఆరబెట్టాలి. తరువాత పొడి చేసి పెట్టుకుంటే సరిపోతుంది.