మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: బుధవారం, 29 నవంబరు 2017 (21:57 IST)

ఇలా భోజనం చేస్తే వందేళ్ళు బతకడం గ్యారంటి...

ఈరోజుల్లో చాలామంది కార్యాలయాలకు, కాలేజిలకు, ఇతర అవసరాలకు వెళ్ళేటప్పుడు ఎక్కువగా టైం లేక త్వరత్వరగా భోజనం చేసి వెళుతుంటారు. ఇలా భోజనం చేయడం వల్ల చాలా నష్టాలున్నాయి. అవేంటంటే... త్వరగా భోజనం చేస్తే మనం తినే ఆహారం సరిగా జీర్ణం అవ్వదు. ఆహారాన్ని అలా తినే

ఈరోజుల్లో చాలామంది కార్యాలయాలకు, కాలేజిలకు, ఇతర అవసరాలకు వెళ్ళేటప్పుడు ఎక్కువగా టైం లేక త్వరత్వరగా భోజనం చేసి వెళుతుంటారు. ఇలా భోజనం చేయడం వల్ల చాలా నష్టాలున్నాయి. అవేంటంటే... త్వరగా భోజనం చేస్తే మనం తినే ఆహారం సరిగా జీర్ణం అవ్వదు. ఆహారాన్ని అలా తినేటప్పుడు ఆ ఆహారన్ని మనం సరిగ్గా నమలే అవకాశం వుండదు. అందువల్ల నమలని ఆహారం త్వరగా జీర్ణం అవ్వదు.
 
మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వకపోతే అసిడిటీ గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు వస్తుంటాయి. జీర్ణక్రియపైన ఒత్తిడి పడితే అది మన శరీరానికి సరిగా పోషకాలని అందించదు. భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా 15 నుంచి 25 నిమిషాల సమయాన్ని కేటాయించాలి. లేకపోతే ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా సరే ఆహారాన్ని మరీ ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా తీసుకోవాలి. ప్రతిరోజూ ఒకే నిర్ణీత సమయానికి భోజనం చేయాలి. ఇలా చేస్తే దీర్ఘాయిష్షులవుతారు.