మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శనివారం, 1 జులై 2017 (15:21 IST)

టిఫిన్ చేసిన వెంటనే కాఫీ, టీలు తాగడం చేస్తే?

టిఫిన్ లేదా భోజనం చేసిన వెంటనే కాఫీ, టీలు తాగే అలవాటున్నవారు మానుకోవాల్సిందే అంటున్నారు.. వైద్యులు. టిఫిన్ ముగించిన వెంటనే ఓ కప్పు కాఫీ లేదా టీ తాగడం.. అదే అలవాటును మధ్యాహ్నం, రాత్రి పూట కొనసాగించడం ద

టిఫిన్ లేదా భోజనం చేసిన వెంటనే కాఫీ, టీలు తాగే అలవాటున్నవారు మానుకోవాల్సిందే అంటున్నారు.. వైద్యులు. టిఫిన్ ముగించిన వెంటనే ఓ కప్పు కాఫీ లేదా టీ తాగడం.. అదే అలవాటును మధ్యాహ్నం, రాత్రి పూట కొనసాగించడం ద్వారా జీర్ణ వ్యవస్థ మందగిస్తుందని, జీర్ణక్రియకు ఇది మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కడుపులో సగానికి సగం నీరు, సగానికి సగం ఆహారం ఉండేలా చూసుకుంటేనే జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. 
 
అలాకాకుండా వేడి వేడి టీ, కాఫీలు తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తాయి. ముఖ్యంగా పాలు, కాఫీ తాగిన వెంటనే టిఫెన్‌ చేయకూడదు. అలాగే టిఫెన్‌ చేసిన వెంటనే వాటిని తాగకూడదు. ఆహారానికి ముందు వెనకా గంట బ్రేక్ ఇచ్చాకే టీ, కాఫీలు తాగాలి. అలాకాకుంటే.. గ్యాస్, అసిడిటీ సమస్యలకు దారితీస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్‌పై ప్రభావం చూపుతుంది. గుండెకు కూడా ఇది మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
అలాగే ఉదయాన్నే టిఫిన్‌‌‌ చేసిన తర్వాత ఆఫీసుకు డ్రైనట్స్‌, స్నాక్స్‌, బ్రెడ్‌ లాంటివి తీసుకెళ్లాలి. లంచ్‌ తీసుకొనేలోపు వీటిని తినడం ద్వారా కేలరీలతు తగినట్లు శక్తి పొందగలుగుతారు. నిద్రలేవగానే ఒక్కోసారి బయటికి వెళ్లాల్సివస్తే వెంటనే టిఫిన్‌ చేయకుండా ప్రయాణంలో తీసుకొనే ప్రయత్నం చేయండి. ప్రతిరోజూ ఒకే సమయానికి అల్పాహారం చేసే ప్రయత్నం చేయండి. దీని వలన మీ జీర్ణవ్యవస్థ సక్రమంగా, క్రమబద్ధంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.