బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Updated : బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (22:46 IST)

ఉదయం నుంచి రాత్రి వరకూ ఎలాంటి భోజనం? (video)

ఉదయం నుంచి రాత్రి వరకూ ఎలాంటి భోజనం తీసుకోవాలని చాలామంది ఆలోచిస్తుంటారు. ఆరోగ్యంగా వుండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. ఉదయాన్నే గ్లాసు లెమన్ జ్యూస్‌ను తీసుకోవాలి. ఈ లెమన్ జ్యూస్‌ను ఖాళీ పొట్టతో తీసుకోవడం వలన బరువు తగ్గుతారు.

 
ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరిగా ఎక్కువగా తీసుకోవాలి. అందులోనూ అధిక ప్రోటీన్స్‌ ఉన్న ఎగ్, బ్రౌన్‌బ్రెడ్ వంటి ఆహారాలను తీసుకోవాలి. మద్యాహ్నం భోజనానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. భోజనంలో తీసుకొనే పదార్థాల్లో ప్రోటీన్స్, మినరల్స్, న్యూట్రీషియన్స్ అధికంగా ఉండేలా చూసుకోవాలి. వేగంగా బరువు తగ్గాలనుకొనేవారు, ఎక్కువ విశ్రాంతి తీసుకోకూడదు. చిన్నపాటి విరామాలు తీసుకుంటే సరిపోతుంది.

 
అలానే ఆహారంలో విటమిన్స్ మాత్రమే కాకుండా, శరీరానికి మరో ప్రధానమైన విటమిన్ డి చాలా అవసరం అవుతుంది. ఈ విటమిన్ ఉదయం సూర్యరశ్మి వలన పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.