బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ , శుక్రవారం, 21 జనవరి 2022 (13:18 IST)

గుడ్డు పోయి... ఇడ్లీ వ‌చ్చే డాం...డాం...డాం

ఏపీలో మధ్యాహ్న భోజనం మెనూ మారింది. గురువారం రోజు విద్యార్థుల‌కు ఇడ్లీ, సాంబార్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం మెనూలో మార్పులు చేసేందుకు విద్యాశాఖ ప్రయత్నిస్తోంది. వారంలో ప్రతి గురువారం మధ్యాహ్న భోజనానికి బదులు ఇండ్లీ సాంబార్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. దీనికోసం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. ఇక్క‌డ  గురువారం ఇడ్లీ సాంబారు ట్రై చేశారు.
 
 
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు ఒక్కొక్కరికి నాలుగు ఇడ్లీలు, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఐదు ఇడ్లీల చొప్పున ఇవ్వనున్నట్టు మధ్యాహ్న భోజన పథకం అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. పాత మెనూ ప్రకారం గురువారం మధ్యాహ్నం కిచిడీ, టమోట చట్నీ, ఉడికించిన గుడ్డును విద్యార్థులకు ఇచ్చేవారు.