తేనెలో కాస్త గ్లిజరిన్‌ కలిపి రాసుకుంటే...

సాధారణంగా చలికాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ప్రధానంగా ఎదురయ్యే సమస్యలు చర్మం పొడిబారటం, పగలటం, మంటపెట్టడం, చిటపటలాడటం, దురద పెట్టడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

సోమవారం, 13 నవంబరు 2017 (10:16 IST)
సాధారణంగా చలికాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ప్రధానంగా ఎదురయ్యే సమస్యలు చర్మం పొడిబారటం, పగలటం, మంటపెట్టడం, చిటపటలాడటం, దురద పెట్టడం వంటి సమస్యలు తలెత్తుతాయి. పొడిబారిన చర్మం ఉన్న వారికి ఈ సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఆయిల్ స్కిన్ ఉన్న వారికీ సమస్యలు తప్పవు. అందుకే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చర్మాన్ని చలికాలంలో కాపాడుకోవచ్చు. 
 
చలికాలం పొడవునా వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి వేసవి కాలం తరహాలో నీరు పదేపదే తాగాలనిపించదు. పైగా గాలిలో తేమ తక్కువ కాబట్టి శరీరం నుంచి బయటకు వెళ్లే నీటి శాతం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీంతో చర్మం మరింతగా పొడిబారి పోవడమూ తప్పదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే నీరు తాగుతూ పోవడమే.. దీనికి అదనంగా వ్యాయామం చేయడం మర్చిపోవద్దు. చలికాలం రోజుకు కనీసం అర్థగంట పాటైనా వ్యాయామం చేస్తే రక్తప్రసరణ ప్రక్రియ చక్కగా సాగుతుంది. కండరాలు ఉత్తేజితం అవుతాయి కూడా.
 
స్నానానికి ముందు కొబ్బరి లేదా ఆలివ్‌ నూనెను ఒంటికి పట్టించి గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మం పొడిబారదు. అలాగే చెంచా శెనగపిండికి చిటికెడు పసుపూ, అరచెంచా పాలు లేదా పెరుగు కలిపి ముఖం, మెడకు రాసుకుని బాగా మర్దన చేయాలి. ఆ తర్వాత స్నానం చేస్తే ముఖానికి తేమ అందుతుంది. 
 
పెదవులు పొడిబారి పగిలినట్లు ఉంటాయి. తేనెలో కాస్త గ్లిజరిన్‌ కలిపి రాసుకోవాలి. ఇలా రోజులో 2-3సార్లు చేస్తుంటే పగుళ్ల సమస్య తగ్గి పెదవులు తాజాగా కనిపిస్తాయి. చర్మం పొడిబారినప్పుడు పాదాలు కూడా పగలడం కొందరిలో కనిపిస్తుంది. ఇలాంటివారు టేబుల్‌స్పూను ఆలివ్‌నూనెకు అరచెంచా నిమ్మరసాన్ని కలిపి రాత్రుళ్లు పాదాలకు రాసుకుని సాక్సులు వేసుకోవాలి. ఇలాంటి చిట్కాలు పాటించినట్టయితే చలికాలంలో చర్మాన్ని రక్షించుకోవచ్చు. 

అన్నీ చూడండి

నెల్లూరులో నో, ఆన్‌లైన్‌లో మహానాడు, చంద్రబాబు పొదుపు చర్యలు

తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూసి నా చెవుల్లో ఊదరకొట్టేస్తున్నారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వీడియో

ఆస్తమా రోగులకు శుభవార్త - జూన్ 8న చేప మందు ప్రసాదం పంపిణీ

పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటబోయింది... ఇంతలోనే వేగంగా రైలు, వీడియో

ప్రేమించి పెళ్లాడి బిడ్డను కని, ఆ బిడ్డను అమ్మేసి మరొకరితో పెళ్లికి సిద్ధమైన వివాహిత

అన్నీ చూడండి

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments